మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై ఎన్.టి.ఆర్ కామెంట్స్..!

ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్.టి.ఆర్ రాజమౌళి నెక్స్ట్ చేయబోతున్న మహేష్ సినిమా గురించి కూడా ప్రస్థావించారు.మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా ఎప్పుడు రావొచ్చని ఇంటర్వ్యూలో యాంకర్ అడిగితే 2026 అని తారక్ సరదాగా సమాధానం ఇచ్చాడు.

 Ntr Comments On Mahesh Rajamouli Movie,ntr, Mahesh Babu , New Movie , Comments ,-TeluguStop.com

అయితే వెంటనే రాజమౌళి ఆ సినిమాకు ఎక్కువ టైం తీసుకోనని అన్నారు.అయినా సరే ఎలాంటి కొవిడ్ లు రాకుంటే 2025లో మహేష్, రాజమౌళి సినిమా వస్తుందని మరోసారి అన్నారు ఎన్.టి.ఆర్.

ఆర్.ఆర్.ఆర్ సినిమా 2022 లో వస్తే మహేష్ సినిమా కోసం రాజమౌళి ఎలా లేదన్నా మరో 3 ఏళ్లు టైం తీసుకుంటాడని ఎన్.టి.ఆర్ మాటల్లో చెప్పేశాడు.రాజమౌళి సినిమాలు టైం తీసుకుంటాయేమో కానీ టార్గెట్ రీచ్ అవడంలో మాత్రం వెనకాడవు.

ఈ క్రమంలో మహేష్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.ఎప్పుడు వస్తుంది అన్నది ఆ మూవీ యూనిట్ కన్ ఫర్మ్ చేయాల్సి ఉంది.

మహేష్ మాత్రం సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రం సినిమా చేస్తాడని తెలుస్తుంది.రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యేలోగా త్రివిక్రం సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారు.

 అందుకే దుబాయ్ లో ఉన్న మహేష్ ను కలిసి త్రివిక్రం సినిమా ఫైనల్ స్క్రిప్ట్ డిస్కషన్స్ పూర్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube