దేవర ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.. ఆ పనులతో బిజీ బిజీగా మేకర్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) నటించిన ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత తారక్ రేంజ్ పాన్ ఇండియా వైడ్ గా పెరిగింది.

 Ntr And Koratala Siva Devara Movie Latest Update, Devara, Ntr , Koratala Shiva,-TeluguStop.com

ఇక అంతటి ఘన విజయం అందుకున్న తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాదిలో కొత్త సినిమాను లాంచ్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.ఆ కొత్త మూవీ షూట్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర” ( Devara).ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.ఈ సినిమాలో కొరటాల ఎన్టీఆర్ ను ఫుల్ మాస్ యాంగిల్ లో చూపించ బోతున్నట్టు అర్ధం అయ్యింది.

ఇక ఈ సినిమా నుండి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తుంటాయి.తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ ఇచ్చారు.ప్రజెంట్ ఈ సినిమా పాటలు వర్క్స్ లో బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ సినిమాకు సాంగ్ వర్క్ ను స్టార్ట్ చేసినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

మరి ఇదే విషయాన్నీ దేవర టీమ్ కూడా సాంగ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు కన్ఫర్మ్ చేసారు.దీంతో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఎలాంటి పవర్ఫుల్ మ్యూజిక్ ఆల్బమ్ అందిస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) ఫిక్స్ అయ్యింది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) విలన్ గా నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube