ప్రపంచంలో మిలిటరీ శక్తి సామర్థ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది.అలాంటి దేశానికి పంటి కింద రాయిలా ఉత్తర కొరియా తయారైంది.
ఎప్పటికప్పుడు అణు క్షిపణుల పరీక్షలను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ నిర్వహిస్తుంటాడు.తాజాగా ఉత్తర కొరియా సైన్యాన్ని స్థాపించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ దేశ రాజధాని ప్యాంగాంగ్ సిటీలో సైనిక కవాతు నిర్వహించారు.
దీనికి కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో సైనిక పరేడ్‌కు హాజరయ్యాడు.మిలిటరీ పరేడ్‌లో తాజా అణు క్షిపణులను ప్రదర్శించారు.
ఇందులో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి (ఐసిబిఎం) ను కూడా ఉంది.దీంతో ఈ సైనిక కవాతుపై అంతా పరిశీలించసాగారు.
ఉత్తర కొరియా సైన్యం స్థాపించిన 75 వ వార్షికోత్సవం సందర్భంగా ఆ కవాతు నిర్వహించారు.కిమ్ జోంగ్ ఉన్ తో ఆయన కుమార్తె కనిపించినందున, భవిష్యత్తులో ఆమె ఉత్తర కొరియాకు అధ్యక్షురాలు కావొచ్చనే ఊహాగానాలు ఎక్కువ అయ్యాయి.కవాతుకు పెద్ద సంఖ్యలో సైనికులు, పౌరులు హాజరయ్యారు.ఈ సమయంలో, కొత్తగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన అనేక రకాల క్షిపణులు, ఆయుధాలు ప్రదర్శించబడ్డాయి.ఉత్తర కొరియా నిరంతరం క్షిపణి పరీక్షలు చేస్తోంది.ఉత్తర కొరియా డజను ఐసిబిఎంల గురించి సిద్ధం చేస్తోంది.
ముఖ్యంగా అమెరికాను ఉద్దేశించి ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను తయారు చేస్తోంది.వాటిని తాజాగా బహిరంగ పరిచి అమెరికాకు పరోక్షంగా హెచ్చరిక సంకేతాలు పంపింది.
ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలు ఉన్నప్పటికీ, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తోంది.ముఖ్యంగా ఐసీబీఎం హ్వాసాంగ్-17ని సైనిక కవాతులో ప్రదర్శించింది.
ఏకంగా 11 ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్స్ సైనిక కవాతులో ఉత్తర కొరియా ప్రదర్శించి, తన సత్తాను చాటింది.