తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నేతల తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.55 ఏళ్లలో చాలా చేశామని చెప్పుకుంటున్నారని, ఒకవేళ చేస్తే ప్రతిపక్షంలో ఎందుకు కూర్చుంటారని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు తొమ్మిది నెలల్లో అధికారంలోకి వస్తామని చెబుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారన్న కేటీఆర్ మీరు మాత్రం అధికారంలోకి రారంటూ ఎద్దేవా చేశారు.
మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు.వడ్డించే వాళ్లు మనవాళ్లు అయితే అన్న రీతిలో కేంద్రం వ్యవహారిస్తుందన్నారు.
శత్రుదేశం మీద కక్ష కట్టినట్లు తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు.







