బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ నేత ప్రేమేందర్ రెడ్డి అన్నారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనన్నారు.
రేపు యధావిధిగా పాదయాత్ర ప్రారంభంకానుందని, అంతకముందు బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయాత్రను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.