గడిచిన ఐదేళ్ల కాలంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు ఎవరూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరలేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు తెలిపింది.ఈ మేరకు కేంద్ర అంతరిక్ష, అణుశక్తి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో ప్రకటన చేశారు.
గత ఐదేళ్ల కాలంలో విదేశీ అంతరిక్ష సంస్థల్లో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు ఇస్రోలో చేరలేదని.అలాగే ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలెవరూ భారత్‌ను వీడి మరో దేశానికి వెళ్లలేదని జితేంద్ర సింగ్ చెప్పారు.
మరో ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.అంతరిక్ష వ్యర్ధాల నుంచి భారత ఉపగ్రహాలను సురక్షితంగా వుంచడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్/ ఇస్రో చర్యలు చేపట్టేందని మంత్రి తెలిపారు.
ఇస్రోకు చెందిన అంతరిక్ష ఆస్తులను నిర్వహించడానికి డైరెక్టరేట్ ఫర్ స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ అండ్ మేనేజ్‌మెంట్‌ను స్ఠాపించామని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.ఈ అత్యాధునిక స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ కంట్రోల్ సెంటర్ ప్రస్తుతం.
అంతరిక్ష వ్యర్ధాల నుంచి భారత ఉపగ్రహాలకు కలిగే ముప్పును అంచనా వేసేందుకు పనిచేస్తోందని కేంద్ర మంత్రి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు.
కాగా.ప్రాజెక్టు నేత్ర (నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్) పేరుతో భారతీయ శాటిలైట్ల సంరక్షణకు ఇస్రో పూనుకున్న సంగతి తెలిసిందే.స్పేస్ సిచ్యువేషనల్ అవేర్‌నెస్(ఎస్ఎస్ఏ)లో భాగంగా నేత ప్రాజెక్టును చేపట్టారు.
రోదసిలో ఉన్న గ్రహశకలాలు, ఇతర వస్తువులతో భారతీయ శాటిలైట్లకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇస్రో ఈ చర్యలు చేపట్టింది.ఈ ప్రాజెక్టు కోసం సుమారు 400 కోట్లు ఖర్చు చేయనున్నారు.
అంతరిక్ష వ్యర్ధాల నుంచి ప్రమాదాలను పసికట్టేందుకు అగ్రదేశాలు కూడా ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టాయి.
మిస్సైళ్లు, అంతరిక్ష దాడుల నుంచి కూడా రక్షణ కల్పించే విధంగా ప్రాజెక్టు నేత్రను రూపొందిస్తున్నారు.‘లో ఎర్త్ ఆర్బిట్‌లో నేత్ర పర్యవేక్షణ కొనసాగనున్నది.సుమారు 10 సెంటీమీటర్ల సైజున్న వాటిని కూడా గుర్తించే విధంగా నేత్రను డిజైన్ చేస్తున్నారు.
నేత్ర సాయంతో దాదాపు 36 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్లపై ఇస్రో నిఘా పెట్టనుంది.జమ్మూకాశ్మీర్‌లోని లేహ్ , పొన్‌ముడి, మౌంట్ అబూ వంటి ప్రదేశాల్లోనూ లాంగ్ రేంజ్ టెలిస్కోప్‌లను అమర్చనున్నారు.
ప్రస్తుతం జియోస్టేషనరీ ఆర్బిట్‌లో భారత్‌కు చెందిన సుమారు 15 కమ్యూనికేషన్ శాటిలైట్లు ఉన్నట్లు ఇస్రో చీఫ్ శివన్ గతంలో ప్రకటించారు.