బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ దాడులను మంత్రి జగదీశ్ రెడ్డి ఖండించారు.ఐటీ, ఈడీ దాడులతో బీఆర్ఎస్ నేతలను బీజేపీ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందని తెలిపారు.
కానీ తాము ఎలాంటి దాడులకు భయపడమని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.రాజకీయ కక్షలో భాగమే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలని తెలిపారు.
శేఖర్ రెడ్డి పార్టీలోకి రాకముందే ఆయనొక వ్యాపార వేత్తని చెప్పారు.శేఖర్ రెడ్డిని ఇబ్బందుల పాలు చేయడం పిరికి పందల చర్యని వెల్లడించారు.