అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టైమ్ అసలు బాలేదనే చెప్పాలి.ఒక వైపు కరోనా ట్రంప్ ని కుదిపేసి ,ఊపేసి ట్రంప్ ని మెంటల్ గా టార్చర్ చేస్తుంటే మరో వైపు ట్రంప్ చేసిన తప్పులు ఇవిగో అంటూ ప్రముఖ పత్రికలూ అన్నీ ట్రంప్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నాయి.
న్యూయార్క్ టైం వరుస కధనాలతో ఇప్పటికే ట్రంప్ ని నడిరోడ్డుపై నిలబెట్టాగా తాజాగా వాషింగ్టన్ పోస్ట్ శ్వేత సౌధం పై విమర్శలు ఎక్కుపెట్టింది.కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో వైట్ హౌస్ ఘోరంగా విఫలం అయ్యిందని ఏకిపారేసింది.
కరోనా వైరస్ విషయంలో వైట్ హౌస్ నాలుగు ప్రధానమైన విషయాల్లో విఫలం అయ్యిందని రాసుకొచ్చింది.కరోనా మహమ్మారిని గుర్తించేందుకు అవసరమైన పరీక్షలని రూపొందించే విషయంలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పై భారీ స్థాయిలో నమ్మకం పెట్టుకోవడం ఒక తప్పిదం అయితే, కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిధుల కేటాయింపు విషయాన్ని రాజకీయంగా తనకి ఉపయోగపడేలా వాడుకోవాలని అనుకోవడం.
దాంతో విలువైన సమయం వృధా అవ్వడం.
అంతర్గత పోరు, వైరస్ టాస్క్ ఫోర్స్ విదులకి తీవ్ర ఆటంకం కలిగించడం వంటివి జరిగాయని ప్రచురించింది.
తాము ఈ సంచారాన్ని సేకరించడానికి ఎంతో మంది అధికారులు, వైద్య నిపుణులు, ఇంటిలిజన్స్ అధికారులు ఇలా కరోనా సమయంలో విధులు నిర్వర్తించిన వారిని 47 సార్లు ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టుగా సంచారం అందుతున్నా వైట్ హౌస్ అసలు పట్టించుకోలేదని గడించిన రెండు నెలల కారంలో వైట్ హౌస్ అన్ని విషయాలలో ఫెయిల్ అయ్యిందని రాసుకొచ్చింది సదరు పత్రిక.