నెల్లూరులో వైసీపీకి మరో దెబ్బ.. ?

గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా తెగ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో ముసలం ఏర్పడి ఆ పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది.

 Nellore Politics Disturbing Ycp? , Nellore , Ycp, Kotamreddy Sridhar Reddy , An-TeluguStop.com

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Kotamreddy Sridhar Reddy ), ఉదయగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వంటి వాళ్ళు ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించబడడంతో జిల్లాలో పార్టీ ప్రభావం మెల్లగా తగ్గుతూ వస్తోంది.ఇక అంతటితోనే ముగిసిపోయిందంటుకుంటే మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఆయన చిన్నన్న రూప్ కుమార్ మద్య నెలకొన్న రాజకీయ విభేదాలు.

వైసీపీని మరింతగా దెబ్బ తీస్తున్నాయి.మొత్తం మీద జిల్లాలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Telugu Ap, Janasena, Kotamsridhar, Nellore, Roop Kumar, Ys Jaganmohan-Politics

నేతల మద్య విభేదాలు అంతర్గత వివాదాలతో పార్టీ పూర్తిగా బలహీన పడుతూ వస్తోంది.గత కొన్నాళ్లుగా అనిల్ కుమార్ యాదవ్ మరియు రూప్ కుమార్ మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనెంతలా వివాదాలు కొనసాగుతున్నాయి.వీరిద్దరిని కలిపేందుకు స్వయంగా జగనే రంగంలోకి దిగిన పెద్దగా ఫలించలేదు.ఇదిలా ఉంచితే వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ).మంత్రి పదవి పోయినప్పటి నుంచి మునుపటి జోరు చూపించడం లేదు.ఏదో నామమాత్రంగా పార్టీ గురించి ప్రస్తావిస్తున్నారే తప్పా.

గతంలో మాదిరి పార్టీకి సబంధించిన వ్యవహారాలలో ఆయన జోక్యం కనిపించడం లేదనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కు సంబంధించి వైసీపీలో రూప్ కుమార్ కు ప్రదాన్యత పెరగడం, అనిల్ కుమార్ కు ఏ మాత్రం మింగుడు పడడం లేదట.

Telugu Ap, Janasena, Kotamsridhar, Nellore, Roop Kumar, Ys Jaganmohan-Politics

దాంతో పార్టీ వ్యవహారాలలో అనిల్ అంటి అంతనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.ఇటీవల ఎమ్మెల్యేలతో జగన్ ( CM jagan )నిర్వహించిన సమావేశానికి కూడా అనిల్ కుమార్ హాజరు కాలేదు.దీంతో ఆయన వైసీపీని వీడనున్నారా అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.అయితే గతంలో తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోనే ఉంటానని కుండబద్దలు కొట్టిన అనిల్.

ఒకవేళ పార్టీ మరాల్సి వస్తే రాజకీయాలకే గుడ్ బై చెబుతానని స్పష్టం చేశారు.అయితే పాలిటీషియన్స్ ఎప్పుడు ఎలా మాట్లాడటారో.ఎలా వ్యవహరిస్తారో ఊహించడం చాలా కష్టం.ఆ విధంగా చూస్తే ప్రస్తుత పరిణామాల దృష్టి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీని వీడే అవకాశం ఉందనే మాటనే ఎక్కువగా వినిపిస్తోంది.

ఇదే గనుక జరిగితే నెల్లూరు జిల్లాలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంలోకి వెళ్ళే అవకాశం లేకపోలేదు.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube