సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి నయనతార( Nayanatara ) పెళ్లి అయినప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె మొదటిసారి అట్లీ( Atlee ) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) సరసన నటించిన జవాన్ సినిమా (Jawan Movie) ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల సంచలనాలను సృష్టిస్తుంది.షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి నయనతార ఏకంగా ఆయనతో కలిసి నటించిన ఈ సినిమా విడుదల కావడంతో నయనతార అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో నయనతార గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నయనతార ఈ సినిమా విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.డైరెక్టర్ అట్లీ అలాగే షారుఖ్ ఖాన్ ఈమె అసంతృప్తి వ్యక్తం చేశారట.షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి నయనతార ఆయన సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ నయనతారకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనీ, ఈ విషయంలో డైరెక్టర్ అట్లీతో పాటు షారుక్ ఖాన్ నయనతార అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది అయితే ఈ వార్తలను మాత్రం నయనతార అభిమానులు పూర్తిగా ఖండిస్తున్నారు.
నయనతార షారుక్ ఖాన్ కు వీరాభిమాని ఆయన సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషపడ్డారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె స్వయంగా తన భర్తతో కలిసి ముంబై వెళ్లి ఓ థియేటర్లో ఈ సినిమాని చూశారు అంతేకాకుండా ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా నయనతార పాల్గొనబోతున్నారని అందుకే ఈమె ముంబై వెళ్లారు అంటూ నయనతార ఎయిర్ పోర్ట్ కి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతుంది.ఇలా నయనతార గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదంటూ అభిమానులు ఈ వార్తలను ఖండిస్తున్నారు.
.