సర్దుకుపోవాలే గానీ ఈ సింగిల్ బెడ్‌రూమ్ స్వర్గమట.. ఈ కుర్రాడి మాటలు వింటే..

స్మార్ట్ సిటీలలో బతకాలంటే సామాన్యుడికి ఎంత కస్టమో మీకు తెలియంది కాదు.అలాంటిది సొంతంగా ఒక నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే మరెంత కస్టమో ఊహించుకోవచ్చు.

 This Single Bedroom Is Heaven If You Listen To This Guy, Adjustable, Bed Room, S-TeluguStop.com

అవును, సిటీలలో సింగిల్ బెడ్రూం ఇల్లు.మార్కెట్ ధర ఏకంగా రూ.2.50 కోట్లు వరకు వుంది.ఇక ఆ ఇల్లు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.సర్దుకుపోవాలే గానీ స్వర్గమేనంటూ ఓ యువకుడు తన ఇల్లును చూపించిన తీరు, వర్ణించిన తీరు నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది.

ఏంటీ.ఇలాంటి ఇల్లు రెండున్నర కోట్లా అంటూ జనాలు మూర్ఛపోతున్న పరిస్తితి.

నలుగురు మనుషులు నిలబడేంత చోటుకూడా లేని ఇంటికి అంత రేటేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి.వివరాల్లోకి వెళితే దక్షిణ ముంబైలో( South Mumbai ) ఉంది ఆ ఇల్లు.కాగా దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.ముంబై అంటే అంతే బాస్… మనమే కాంప్రమైజ్ కావాలి, సర్దుకుపోతే ఎక్కడున్నా స్వర్గమే! అంటూ ఆ యువకుడు తన ఇంటిని పరిచయం చేయడం విశేషం.

చిన్న అగ్గిపెట్టె లాంటి సింగిల్ బెడ్ రూం ఇల్లు( Single bedroom house ) అది.అందులో ఓ బెడ్‌రూంలో ఆరడుగల మనిషి పూర్తిగా కాళ్లు చాపుకుని పడుకోలేని పరిస్థితి.ఇక అంత చిన్న బెడ్‌రూం పక్కనే మరింత చిన్నదైన కిచెన్.అక్కడ ఒక్క మనిషి కూడా సరిగా నిలబడలేని పరిస్థితి వుంది.అంటే ఆ కిచెన్లో సౌకర్యంగా వంట చేసే వీలు కూడా లేదు.

ఇక ఆ కిచెన్‌ పక్కనే ఓ బాత్రూమ్. అది ఎంత చిన్నగా ఉందో మాటల్లో చెప్పడం ఒకింత కష్టం.ఇక్కడ కొసమెరుపు యేమిటంటే, అంత చిన్న ఇంట్లోనూ ఏసీ ఉండటం.

ఇల్లు చిన్నదే అయినా సౌకర్యాలు మాత్రం ఉన్నాయంటూ అతడు తన ఇంటిని గురించి వీడియోలో చెప్పుకొచ్చాడు.అదేవిధంగా బాత్రూమ్‌లో గీజర్ కూడా ఉండటం మరో ప్రత్యేకత.కాగా మహానగరాల్లో సామాన్యుల బతుకులు ఇలాగే ఉంటాయంటూ అనేక మంది కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube