చాలా సినిమా ఫైట్ సీన్లలో రక్తం ఏరులై పారుతుంది.హాలీవుడ్ చిత్రాల్లో ఈ రక్త ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది.
బాలీవుడ్ లోనూ వెండితెరపై రక్తపు మరకలు కనిపిస్తాయి.ఇక టాలీవుడ్ లో బాలయ్య సినిమాలు రక్తం లేకుండా కనిపించనే కనిపించవు.
ఆయన ప్రతి సినిమాలోనూ రక్త ప్రవాహం ఉడాల్సిందే!
అయితే ఈ రక్తం ఎక్కడి నుంచి తెస్తారు.సినిమాల్లో కనిపించేది అసలు నిజమైన రక్తమేనా అని ఎప్పుడైనా అనుమానం కలిగిందా? కలగితే మీ అనుమానం నిజమే.అది నిజమన రక్తం కాదు.కృత్రిమంగా తయారు చేసిన ద్రావణం.దానికి గ్రాఫిక్స్ లో అదనపు హంగులు అద్ది నిజమైన రక్తం అనేలా భ్రమింపజేస్తారు దర్శకులు.ఇంతకీ ఈ రక్తపు ద్రావణాన్ని ఎలా తయరు చేస్తారో ఇప్పుడు చూద్దాం!

సినిమా రక్తం తయారీకి ప్రధానంగా కార్న్ సిరఫ్ వాడుతారు.ఇది మరీ చిక్కగా ఉండదు.అలాగని పల్చగా ఉండదు.
అచ్చం రక్తంలాగే కనిపించే గుణం ఉంటుంది.దీంతో పాటు ఒప్యాస్టి పైర్ వాడుతారు.
ఇది కార్న్ సిరఫ్ కు తెలుపు వర్ణాన్ని ఇస్తుంది.ఈరెండింటిని కలిపి బాగా చిలుకుతారు.
ఈ ద్రావణానికి రెడ్ కలర్ కలుపుతారు.బాగా మిక్స్ చేస్తారు.
ఆ ద్రావణం సేమ్ రక్తం లాగే కనిపిస్తుంది.
ఇలా తయారైన ఆ ద్రావణంలో నలుపు లేదంటే నీలం రంగును మిక్స్ చేస్తారు.
వీటన్నింటిని కలపడం ద్వారా ఆ ద్రావణం నిజమైన రక్తంలా కనిపిస్తుంది.ఇలా తయరు చేసిన ద్రావణాన్ని ప్రత్యక సీసాల్లో నిల్వ చేస్తారు.
సినిమా పరిశ్రమకు సరఫరా చేస్తారు.సినిమాల్లో పైటింగ్, యాక్సిడెంట్ సహా అవసరం ఉన్న సీన్లలో ఈ ఫేక్ రక్తాన్ని విరివిగా వాడుతారు.
ఈ ఫేక్ బ్లడ్ ఎన్ని రోజులయిన నిల్వ ఉంటుంది.అంతే కాదు ఇది వొంటిపై పోసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.