నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, RJ హేమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం # మాయలో(#MayaLo).మెగా మిత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ పై షాలిని నంబు, రాధా కృష్ణ నంబు సంయుక్తంగా నిర్మించారు.యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కథ:
మాయ (జ్ఞానేశ్వరి)( Gnaneshwari ) తన ప్రియుడు పాల్ తో కలిసి వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది.ఆమెకు క్రిష్ అలియస్ శివ్ కృష్ణ (నరేష్ అగస్త్య),( Naresh Agastya ) సింధు (భావన)( Bhavana ) చిన్ననాటి స్నేహితులుంటారు.వీరు అంతా కలిసి పెరిగి పెద్దవుతారు.
ఈ స్నేహితులంతా పెరిగి పెద్దయిన తర్వాత ఒకరితో మరొకరు రిలేషన్ లో ఉంటారు.మాయ క్రిష్ సింధుని తన పెళ్లికి రావాలని ఆహ్వానిస్తుంది.
మాయ పెళ్లికి పిలవడంతో వీరందరూ కలిసి ఒక కారు తీసుకొని రోడ్డు మార్గాన పెళ్లికి వెళ్తారు.ఈ క్రమంలోనే వీరి ప్రయాణంలో ఎలాంటి మార్పులు జరిగాయి? వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ?అసలు వీరి ఎలా ప్రేమలో పడ్డారు? ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి మాయా సింధు ఎందుకు విడిపోయారు? అనే విషయాలు తెలియాలి అంటే మనం పూర్తి సినిమా చూడాల్సి ఉంటుంది.
నటీనటుల నటన:
నరేష్ అగస్త్య ఇదివరకు పంచతంత్రం, మత్తు వదలరా వంటి సినిమాలలో నటించారు.అయితే ఈ సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.భావనతో కలిసి లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలలో ఎంతో అద్భుతంగా నటించారో అలాగే వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీలా ఫైటింగ్ చేసే సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి.భావన జ్ఞానేశ్వరి వంటి తదితరులు కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
టెక్నికల్:
చిత్ర దర్శకుడు మేఘా మిత్ర పేర్వార్ ప్రస్తుతం ప్రేక్షకులను నాడి తెలుసుకొని వారికి నచ్చే విధంగా ఈ కథను తయారు చేశారు.ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఒక కామెడీని ( Comedy ) చాలా అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు.ఎడిటింగ్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది ఎక్కడ సినిమా బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేశారు.సంగీతం( Music ) గొప్పగా కాకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక నిర్మాత కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాని నిర్మించారని తెలుస్తోంది.
విశ్లేషణ:
ప్రస్తుత కాలంలో ఎన్నో లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.అయితే ఇలాంటి చిన్న సినిమాలు ఎక్కువగా థియేటర్లో కాకుండా ఓటీటీలలో ఎక్కువగా విడుదలవుతున్నాయి.అయితే మాయ సినిమాని మాత్రం దర్శకుడు థియేటర్లోకి తీసుకువచ్చి ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేశారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ కూడా రాదు.అయితే సినిమాని ఎక్కువగా రోడ్డుపై ప్రయాణం చేస్తున్నట్టుగానే చూపించారు.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కథ బాగుంది, ఎక్కడ బోర్ కొట్టని సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
మ్యూజిక్, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చూసిన భావన కలుగుతుంది.
బాటమ్ లైన్:
మాయ సినిమాని చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఈ సినిమా మాయలోనే ఉంటారని చెప్పాలి.ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను నవ్విస్తూ సినిమా ఎంజాయ్ చేసేలా ఉంది.