సాధారణంగా కుక్కలు( Dogs ) చాలా తెలివైనవి ఒకసారి ఏదైనా నేర్పిస్తే అవి వెంటనే అర్థం చేసుకోగలవు.మరోసారి మళ్లీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా అవి వాటంతటవే ఏ టాస్క్ నైనా చేయగలవు.
ఇవి ఫోటోలకు మనుషుల కంటే బాగా ఫోజులు కూడా ఇవ్వగలవు.ఆ విషయాన్ని నిరూపించే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.
దీనిని @Buitengebieden ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 23 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.
8 సెకండ్ల నిడివి ఉన్న ఈ వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు నేల మీద కూర్చున్న రెండు ఎరుపు రంగు కుక్కలు కనిపిస్తాయి.వాటి పక్కనే ఒక నల్ల కుక్క కూడా ఉంటుంది.ఫోటో తీస్తుండగా ఆ కుక్క వెంటనే ఎర్ర కుక్కల వద్దకు వెళ్ళింది.మొదటగా ఒక కుక్క మీద కాల్ చేసింది ఆ తర్వాత మరొక కుక్క మీద తన ముందరకాలని వేసి రెండిటిని తన దగ్గరికి తెచ్చింది అనంతరం వాటి ముఖాల మధ్యలో తన ముఖం పెట్టింది ఆ విధంగా మనుషుల్లో బెస్ట్ ఫ్రెండ్స్( Best friends ) ఎలా దగ్గరగా ఉండి ఫోటో దిగుతారో ఆ విధంగా అది పోజులిచ్చింది.
ఈ మూడు కుక్కలు కూడా కెమెరా వైపే చూస్తుండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ వీడియో చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.కుక్కలకు కూడా ఫోటోల( PhotoS )కు అలవాటు పడుతున్నాయి కదా అని మరి కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.ఈ ఫన్నీ డాగ్ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.