ఎవరితో చేసుకుంటారో చేసుకోండి.. జెర్సీ సీక్వెల్ పై నాని షాకింగ్ కామెంట్స్!

నాచురల్ స్టార్ నాని( Nani ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు తాజాగా ఈయన అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు( Aa Okkati Adakku ) ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా నాచురల్ స్టార్ నాని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 Nani Sensational Comments On Jersey 2 Movie Details, Nani,jersey 2,gautam Thinn-TeluguStop.com

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నానికి జెర్సీ( Jersey ) సినిమా సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.గత ఐదు సంవత్సరాల క్రితం గౌతం తిన్ననూరి( Gautham Thinnanuri ) దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం జెర్సీ.

ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా ఎమోషనల్ గా మాత్రం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా ఈ సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో తిరిగి మరోసారి ఈ సినిమాని ప్రదర్శించారు.అయితే ఇప్పటికీ కూడా అదే స్థాయిలో ఆదరణ రావడం విశేషం ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు.ఇదే విషయాన్ని నానిని ప్రశ్నించడంతో నాని షాకింగ్ సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా నాని జెర్సీ 2 సినిమా( Jersey 2 ) గురించి మాట్లాడుతూ.నేను లేను కదా.జెర్సీ 2 ఎవరితో చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు.జెర్సీ సినిమా క్లైమాక్స్ లో నాని పాత్ర చనిపోతుంది.

దీంతో నానితో సీక్వెల్ తీయలేరు కాబట్టి నాని ఇలా ఎవరితో చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం గమనార్హం.ఒకవేళ ఈ సినిమా సీక్వెల్ కనుక చేయాల్సి వస్తే హీరో నాని కొడుకు పెద్దయ్యాక పాత్రలో నటించిన హరీష్ కళ్యాణ్ తో తీయాలి.

మరి జెర్సీ 2 వస్తుందా లేదా అనేది డైరెక్టర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube