ఎవరితో చేసుకుంటారో చేసుకోండి.. జెర్సీ సీక్వెల్ పై నాని షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
నాచురల్ స్టార్ నాని( Nani ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు తాజాగా ఈయన అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు( Aa Okkati Adakku ) ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నాచురల్ స్టార్ నాని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నానికి జెర్సీ( Jersey ) సినిమా సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
గత ఐదు సంవత్సరాల క్రితం గౌతం తిన్ననూరి( Gautham Thinnanuri ) దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం జెర్సీ.
"""/" /
ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా ఎమోషనల్ గా మాత్రం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
ఇలా ఈ సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో తిరిగి మరోసారి ఈ సినిమాని ప్రదర్శించారు.
అయితే ఇప్పటికీ కూడా అదే స్థాయిలో ఆదరణ రావడం విశేషం ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడ్డారు.
ఇదే విషయాన్ని నానిని ప్రశ్నించడంతో నాని షాకింగ్ సమాధానం చెప్పారు. """/" /
ఈ సందర్భంగా నాని జెర్సీ 2 సినిమా( Jersey 2 ) గురించి మాట్లాడుతూ.
నేను లేను కదా.జెర్సీ 2 ఎవరితో చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు.
జెర్సీ సినిమా క్లైమాక్స్ లో నాని పాత్ర చనిపోతుంది.దీంతో నానితో సీక్వెల్ తీయలేరు కాబట్టి నాని ఇలా ఎవరితో చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం గమనార్హం.
ఒకవేళ ఈ సినిమా సీక్వెల్ కనుక చేయాల్సి వస్తే హీరో నాని కొడుకు పెద్దయ్యాక పాత్రలో నటించిన హరీష్ కళ్యాణ్ తో తీయాలి.
మరి జెర్సీ 2 వస్తుందా లేదా అనేది డైరెక్టర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
అల్లు అర్జున్ కేసు విషయంలో ఏం జరుగుతుంది..?