ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు కోసం చేసేటటువంటి పనులు కారణంగా తమ పూర్తి జీవితాలను చిక్కుల్లో పడేసుకుంటున్నారు.ఇటీవలే కొందరు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ అవసరాలు తీర్చుకునేందుకు డబ్బు అవసరం కాగా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు చిక్కిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవలే స్థానిక రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారం రావడంతో పోలీసులు మెరుపు దాడి చేశారు.ఇందులో భాగంగా ముగ్గురు విటులు మరియు మరికొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలని పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం ప్రెస్ మీట్లో భాగంగా పోలీసులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కొందరు పార్ట్ టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చదువుకునేటువంటి విద్యార్థులను మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.అలాగే నల్గొండ పరిసర ప్రాంతంలో రమేష్ అనే ఓ వ్యక్తి తన భార్యతో కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడని తమకు సమాచారం రావడంతో ఇంటిపై రైడ్ చేశామని తెలిపారు.
ఈ రైడ్ లో దొరికిన మహిళలలో ఎక్కువ మంది ఇంటర్ మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఉన్నారని వీరికి డబ్బు ఆశ చూపి రమేష్ మరియు అతడి భార్య గత కొద్దిరోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలిపారు.
దీంతో చదువుకునేటువంటి విద్యార్థులను వ్యభిచార కూపంలోకి అలాగే వారి జీవితాలను నాశనం కావడానికి కారణమైన రమేష్ మరియు అతడి భార్యను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.
అలాగే ఈ రైడ్ లో పట్టుబడిన మహిళలను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నట్లు తెలిపారు.అలాగే తమ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనబడినా మరియు అనుమానాస్పద సంఘటనలు జరిగినా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.