'గోస్ట్' నుండి క్రేజీ పోస్టర్.. కత్తి పట్టుకుని కిల్లింగ్ లుక్ లో నాగ్..!

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.ఈ మధ్యే ఆయన నటించిన బంగార్రాజు సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 Nagarjuna The Ghost Movie Latest Poster Details, The Ghost, Nagarjuna, Poster, Nagarjuna Ghost Movie, Nagarjuna Ghost Look, Nagachaitanya, Director Praveen Sattaru, Action Thriller Movie,-TeluguStop.com

నాగ చైతన్య తో కలిసి నటించిన కూడా కొడుకుకి మించి యాక్టివ్ గా కనిపించాడు.ఈయన ఇప్పటికి యంగ్ గా కనిపిస్తున్నాడు అంటూ మహిళ అభిమానులు ఆయనను పొగుడుతూనే ఉంటారు.

ప్రెసెంట్ నాగార్జున నటిస్తున్న సినిమాల్లో యాక్షన్ థ్రిల్లర్ ది గోస్ట్ సినిమా ఒకటి.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ తెలిపారు.

 Nagarjuna The Ghost Movie Latest Poster Details, The Ghost, Nagarjuna, Poster, Nagarjuna Ghost Movie, Nagarjuna Ghost Look, Nagachaitanya, Director Praveen Sattaru, Action Thriller Movie, -గోస్ట్#8217; నుండి క్రేజీ పోస్టర్.. కత్తి పట్టుకుని కిల్లింగ్ లుక్ లో నాగ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక్క యాక్షన్ సీక్వెన్స్ మినహా మిగతా పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నారు.

మరి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇది ఒక్క ఎపిసోడ్ పూర్తి అయితే గోస్ట్ పూర్తి అయినట్టే.ఇక ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ది గోస్ట్ ఫస్ట్ విజువల్ ను జులై 9న విడుదల చేయనున్నట్టు తెలిపారు.మరి ఈ సందర్భంగా నాగ్ పోస్టర్ కూడా వదిలారు.ఈ పోస్టర్ లో నాగ్ వింటేజ్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టు కున్నాడు.ఈ పోస్టర్ ను వదులుతూ మేకర్స్.కిల్లింగ్ మెషీన్ ను వదులుతున్నాం అంటూ నాగ్ పోస్టర్ ను వదలడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి.ఈ పోస్టర్ లో నాగ్ చేతిలో కత్తి పట్టుకుని ఫార్మల్ సూట్ లో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు.

మరి ప్రేక్షకులు ముందు ఎన్నడూ చూడని అనుభవాన్ని అందించేందుకు ప్రవీణ్ సత్తారు కృషి చేస్తున్నాడు.చూడాలి మరీ రాబోయే అప్డేట్ ఎలా ఉండబోతుందో.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube