నాకు పిచ్చి పట్టిందని చైతు అఖిల్ కూడా అనుకున్నారు: నాగార్జున

అక్కినేని నాగార్జున( Nagarjuna ) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నా సామి రంగా( Naa Samiranga ) ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.నూతన డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

 Nagarjuna Interesting Comments On Naa Samiranga Success Meet, Nagarjuna, Naa Sam-TeluguStop.com

ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో తాజాగా చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Telugu Amala, Naa Samiranga, Nagarjuna, Meet-Movie

నాగార్జున ఈ సినిమా సక్సెస్ అయినందుకు ప్రేక్షకులకు ఈ సినిమా కోసం పని చేసిన టీమ్ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం మాట్లాడుతూ సెప్టెంబర్ 20వ తేదీ నాన్నగారి జయంతి ఆరోజే అన్నపూర్ణ స్టూడియో( Annapurna Studio )లో నాన్నగారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.ఆరోజు ఈ సినిమాని కూడా లాంచ్ చేసామని నాగార్జున తెలిపారు.ఒకవైపు విగ్రహావిష్కరణ జరుగుతుండగా మరోవైపు ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని నేను సినిమా పూజా కార్యక్రమానికి వెళ్తుంటే అమల( Amala ) ఎక్కడికి వెళ్తున్నారు అంటూ నన్ను అడిగింది.

Telugu Amala, Naa Samiranga, Nagarjuna, Meet-Movie

అప్పటివరకు నేను ఇలా సినిమాకు కమిట్ అయ్యాను అనే విషయం మా వాళ్లకు కూడా తెలియదని నాగార్జున తెలిపారు.ఇలా సినిమా లాంచ్ ఈవెంట్ కి వెళ్ళాలి అని చెప్పగా ఇప్పుడు అవసరమా కాస్త ఆలస్యంగా వెళ్ళండని చెప్పారు.లేదు ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలి అని చెప్పడంతో అమలతో పాటు నాగచైతన్య( Nagachaitanya ) అఖిల్ ( Akhil ) కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా అన్న విధంగా నన్ను చూసారని ఇంత తక్కువ సమయంలో సినిమాని ఎలా విడుదల చేస్తామంటూ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు కానీ సినిమా టీమ్ నమ్మింది.ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూనే అతి తక్కువ సమయంలో ఈ సినిమాని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారంటూ ఈ సందర్భంగా నాగార్జున చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube