దూత వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్!

అక్కినేని హీరో నాగచైతన్యకు( Nagachaitanya ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.అయితే నాగచైతన్య గత సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

 Nagachaitanya Dootha  Web Series Review And Rating Details Here   , Nagachaitany-TeluguStop.com

చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన థాంక్యూ సినిమా సైతం ప్రేక్షకులను నిరాశపరిచింది.థాంక్యూ రిజల్ట్ వల్ల దూత వెబ్ సిరీస్ పై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు.

అయితే నవంబర్ 30వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న దూత వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.డిసెంబర్ 1న స్ట్రీమింగ్ కావాల్సిన ఈ వెబ్ సిరీస్ ఒకరోజు ముందే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఈ వెబ్ సిరీస్ చైతన్యకు ఫస్ట్ వెబ్ సిరీస్ కాగా దూత2 లో కూడా చైతన్య ప్రధాన పాత్రలో కనిపించనున్నారని భోగట్టా.సాగర్ వర్మ అవధూరి (నాగచైతన్య) వృత్తిరిత్యా జర్నలిస్ట్ కాగా సమాచార్ అనే పత్రికకు ఆయన చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు తీసుకుంటారు.

అతని దగ్గర పీఏగా అమృత(ప్రాచీ దేశాయ్) పని చేస్తూ ఉంటుంది.

Telugu Dhootha, Nagachaitanya, Prachi Desai, Priyabhavani, Review, Tollywood, Vi

సాగవర్ వర్మ తన భార్య ప్రియ (ప్రియా భవానీ శంకర్)( Priya Bhavani Shankar ), కూతురు అంజలి, పెంపుడు కుక్క ఏ తో కలిసి కారులో ప్రయణిస్తున్న సమయంలో పెట్రోల్ అయిపోవడంతో ఒక డాబా దగ్గర కారు ఆగుతుంది.ఆ డాబాలో సాగర్ తన కారుకు ప్రమాదం జరుగుతుందని కుక్క చనిపోతుందని టైమ్ తో సహా ఉన్న పేపర్ కటింగ్ ను చూస్తాడు.ఆ పేపర్ కటింగ్ లో ఉన్న విధంగానే నిజంగా జరుగుతుంది.

ఆ తర్వాత వేర్వేరు సందర్భాల్లో సాగర్ కు పేపర్ కటింగ్స్ కనిపించడం తనకు దగ్గరైన వాళ్లు చనిపోవడం జరుగుతుంది.సాగర్ కు ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడానికి కారణాలేమిటి? సాగర్ తాత భూపతి చేసిన తప్పు ఏమిటి? సాగర్ కు, పీఏ అమృతకు ఉన్న రిలేషన్ వల్ల అమృత ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది? డీసీపీ క్రాంతి షినోయ్(పార్వతి తిరువత్తు) ఈ కేసును ఎలా చేధిస్తారు? డ్రైవర్ కోటి మరణానికి కారణాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ.

Telugu Dhootha, Nagachaitanya, Prachi Desai, Priyabhavani, Review, Tollywood, Vi

దూత వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో తెరకెక్కగా ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది.విక్రమ్ కె కుమార్ ( Vikram Kumar )కథనంతో మ్యాజిక్ చేశారనే చెప్పాలి.ఏ పాత్ర వృథా కాకుండా గతానికి, భవిష్యత్తుకు లింక్ చేయడం ఎంతగానో ఆకట్టుకుంటోంది.అంచనాలకు అందని విధంగా క్లైమాక్స్ ఉండటం ఈ వెబ్ సిరీస్ కు ప్లస్ అయింది.

Telugu Dhootha, Nagachaitanya, Prachi Desai, Priyabhavani, Review, Tollywood, Vi

అయితే ఈ వెబ్ సిరీస్ లో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి.నాగచైతన్య నటన, కథ, కథనం, డైరెక్షన్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.అయితే ఏ తప్పు చేయకపోయినా కొన్ని పాత్రలను చంపేయడం, లంచాలు తీసుకున్న జర్నలిస్టులను టార్గెట్ చేయడం, కొన్ని పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం ఈ వెబ్ సిరీస్ కు మైనస్ అయింది.అయితే ఓటీటీలో మంచి వెబ్ సిరీస్ ను చూడాలని భావించే వాళ్లకు ఈ వెబ్ సిరీస్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

నాగచైతన్య ఓటీటీ డెబ్యూతో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

రేటింగ్ : 3.0/5.0

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube