ఎమ్మెల్యే ధర్మారెడ్డి తీరుపై బీఆర్ఎస్ మాజీ నాయకుడు కొండా మురళీ తీవ్రంగా మండిపడ్డారు.తాను బ్రాహ్మణుల కాళ్లు మాత్రమే మొక్కుతానన్న ఆయన సన్నాసుల కాళ్లను మొక్కను అని చెప్పారు.
తనకు ఆత్మాభిమానం ఎక్కువని తెలిపారు.
పరకాలలో ప్రచారం చేస్తానని కొండా మురళీ చెప్పారు.
కొండా సురేఖను గెలిపిస్తానన్నారు.అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానన్న కొండా మురళీ వేరే అభ్యర్థికి సీటు కేటాయిస్తే వారి గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు.
మైసమ్మ సాక్షిగా ధర్మారెడ్డిని ఓడిస్తానని వెల్లడించారు.