చెత్తలో మున్సిపల్ సిబ్బందికి కనిపించిన అనుమానాస్పద కవర్.. దానిని తెరిచి చూడగా..?

ఈ రోజుల్లో చెత్తలో కనిపించే కొన్నిటిని చూసి మున్సిపల్ సిబ్బంది హడలి పోతున్నారు.ఒక్కోసారి చెత్తకుప్పల్లో దొరికే వాటితో సంబరపడుతుంటే మరోసారి మాత్రం భయపడుతున్నారు.

 Municipal Staff Found A Suspicious Cover In The Garbage , Wastage , Female Child-TeluguStop.com

అయితే తాజాగా ఒక మున్సిపల్ సిబ్బందికి ఒక కవర్ కనిపించింది.దానిని తెరిచి చూడగా వారు ఒక్కసారిగా గుండె పగిలారు.

వివరాల్లోకి వెళితే.మధ్యప్రదేశ్ లోని ఏరోడ్రోమ్ ప్రదేశంలో ఇటీవల మున్సిపల్ కార్మికులు చెత్తని సేకరించడానికి వచ్చారు.

అక్కడి చెత్తను సేకరించి ప్లాంట్ వద్దకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు.

అయితే ఒక చోట తడి, పొడి చెత్తను వేరు చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే వారికి ఒక ప్లాస్టిక్ కవర్ చాలా వెయిట్‌గా ఉన్నట్లు అనిపించింది.దీంతో ఇందులో ఏముంది అబ్బా అనుకుంటూ ఓ కార్మికురాలు ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది.

అంతే ఒక్కసారిగా షాకై ఆ కవర్ కింద పడేసి గట్టిగా అరిచింది.ఎందుకంటే అందులో ఒక ఆడ బిడ్డ మృతదేహం ఉంది.

అందులో ఒక పసిపాప శవం ఉంటుందని తెలియక ఆమె దానిని తెరిచి చూసింది.తర్వాత ఆ శవాన్ని చూసి చాలా భయపడింది.

Telugu Baby Garbage, Female Child, Wastage-Latest News - Telugu

ఆమె చెప్పిన ప్రకారం, ఈ శిశువు వయసు రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది.ఆ పసిపిల్ల బొడ్డుతాడు కూడా ఇంకా వేరు చేయలేదు.కాగా దీని గురించి వెంటనే మున్సిపల్ కార్మికులకు పోలీసులకు తెలుపగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.అనంతరం ఆ శవాన్ని హ్యాండోవర్ చేసుకున్నారు.

ఆడపిల్ల అనే కారణంతో ఈ బిడ్డను కర్కశంగా చంపేశారా? అనే కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు.బిడ్డను ఇలా వదిలేసిన కసాయి వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు విచారణలో మున్సిపల్ కార్మికులు కలెక్ట్ చేసిన చెత్త కేవలం నాలుగు వార్డులకు సంబంధించినదే అని తేలింది.ఆ నాలుగు వార్డులలో ఎవరైనా రీసెంట్‌గా గర్భందాల్చిన వారు ఉంటే వారిని విచారించాలని యోచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube