యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు అన్ని ఏర్పాట్లు జరుగు తున్నాయి.
కొరటాల శివ మెగా హీరోలతో తీసిన ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడంతో ఇతడిపై ఒత్తిడి పెరిగింది.దీంతో స్క్రిప్ట్ విషయంలో పక్కాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నట్టు తెలుస్తుంది.
అందుకే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు మరింత ఆలస్యం అవుతుందట.ఇక ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్లిందంటే ఇక ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేలా శివ బ్యాకెండ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇటీవలే ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో నాలుగేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.దీంతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై అంచనాలను పెంచేసాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అని మొదటి నుండి కూడా చర్చ జరుగుతూనే ఉంది.
ఇప్పటికే బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా అందరి పేర్లు వినిపిస్తున్నాయి.
కియారా అద్వానీ, పూజా హెగ్డే, సమంత, రష్మిక మందన్న, అలియా భట్ ఇలా అందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.ఇక తాజాగా మరొకరి పేరు కూడా వినిపించింది.
తాజాగా మేకర్స్ హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ను సంప్రదించినట్టు ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ వార్తలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేష్ ను మేకర్స్ సంప్రదించలేదని టాక్.
మరి ఎన్టీఆర్ కు జోడీగా నటించబోయే ఆ లక్కీ హీరోయిన్ ఎవరా అని అందరు ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.
ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.