Mrinal Thakur : పెళ్లికూతురు గెటప్ లో షాకిచ్చిన మృణాల్ ఠాకూర్.. పాపం కుర్రాళ్లకు మామూలు షాక్ ఇవ్వలేదుగా?

తమ అభిమాన హీరోయిన్స్ విషయంలో కుర్రాళ్ళు బాగా అభిమానం చూపిస్తూ ఉంటారు.వారిని తమ మనసులో క్రష్ గా చేర్చుకుంటారు.

 Mrinal Thakur Shocked The Bride In Her Getup-TeluguStop.com

వారికి ఏదైనా అయితే అసలు తట్టుకోలేరు.ఇక వాళ్ళు సోషల్ మీడియా( Social media )లో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు వెంటనే వాటిని తెగ వైరల్ చేస్తూ ఉంటారు.

ఇక వారికి పెళ్లి అవుతుంది అంటే అస్సలు తట్టుకోలేరు.పైగా చేసుకోబోయే వాడిపై బాగా ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు.

అయితే కుర్రాళ్లకు ప్రస్తుతం క్రష్ గా ఉన్న మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) కూడా పెళ్లికూతురు గెటప్ లో కనిపించడంతో కుర్రాళ్ళు అస్సలు తట్టుకోలేకపోతున్నారు.ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ బాగా పరిచయం అని చెప్పాలి.ఈమె బాలీవుడ్( Bollywood ) కు చెందిన నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సీతారామం సినిమాతో బాగా దగ్గర అయింది.

ఈమె తొలిసారిగా 2012లో ముజేసే కుచ్ కెహతి ఏ ఖామోషియన్ అనే సీరియల్ తో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక 2014లో విట్టి దండు అని సినిమాతో మరాఠీ వెండితెరపై అడుగు పెట్టింది.

ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ వెండితెరపై అడుగుపెట్టింది.

తెలుగులో గత ఏడాది సీతారామం సినిమా( Seetharam movie )తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన తొలి పరిచయంతోనే తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.తొలిసారి నటనతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది.అంతేకాకుండా తన నాచురల్ అందంతో ఎంతోమందిని తనవైపు మలుపుకుంది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి లవ్ సోనియా అనే సినిమాతో పరిచయం కాగా ఆ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వటంతో ఆ తర్వాత ఏడాది వరుసగా ఏడాదికి రెండు మూడు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

అందులో సూపర్ 30, బట్ల హౌస్, గోస్ట్ స్టోరీస్, తుఫాన్, ధమాకా సినిమాలో నటించగా ఈ సినిమాలు తనకు మరింత గుర్తింపును అందించాయి.ఇక జెర్సీ, ఆంఖ్ మిచోలి అనే సినిమాలలో కూడా నటించిన సంగతి తెలిసిందే.అలా ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోవటంతో దీంతో సీతారామం డైరెక్టర్ ఈ ముద్దుగుమ్మను చూసి ఫిదా అయ్యి తన సినిమాలో తనని హీరోయిన్ గా పెట్టుకున్నాడు.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తన హాట్ అందాలను కూడా బయటపెడుతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక ఫోటో పంచుకోక అందులో తను అచ్చం పెళ్లికూతురుగా కనిపించింది.

పైగా చేతికి మెహేంది, ఎర్రటి లెహంగాలో ఒంటి నిండా నగలతో అచ్చం పెళ్లికూతురులా కనిపించింది.దీంతో ఆమె అభిమానులు చూసి తనకు నిజంగా పెళ్ళేమో అని తట్టుకోలేకపోతున్నారు.

ఇలా రెడీ కావడానికి కారణం ఏంటి అంటూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు.మరి అది ఫోటోషూటా లేదా నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా అని అనుమానాలు జోరుగా వస్తున్నాయని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube