చిరంజీవితో మిస్టర్ ఇండియా అలా ఆగిపోయింది అంటున్న కోదండరామిరెడ్డి

బాలీవుడ్ లో అనిల్ కపూర్, శ్రీదేవి కాంబినేషన్ లో అమ్రిష్ పురి విలన్ గా వచ్చిన మూవీ మిస్టర్ ఇండియా.బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మించాడు.

 Mr India Telugu Remake Stopped Reasons, Tollywood, Bollywood, Megastar Chiranjee-TeluguStop.com

ఆ సమయంలోనే విజువల్ గ్రాండియర్ గా ఈ సినిమాని ఆవిష్కరించారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయింది.సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

అనిల్ కపూర్ కి స్టార్ ఇమేజ్ ని ఈ సినిమా తీసుకొచ్చింది.ఒక మ్యాజిక్ వాచ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.

అప్పట్లో హిందీలో సూపర్ హిట్ అయిన సినిమాలని మన దర్శకులు ఎక్కువగా తెలుగులో రీమేక్ చేసేవారు.ఈ నేపధ్యంలో మిస్టర్ ఇండియా సినిమాని కూడా రీమేక్ చేయాలని అనుకున్నారు.

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.

అయితే ఆ రీమేక్ సెట్స్ పైకి వెళ్లకపోవడానికి కారణాలు తాజాగా కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ చేశాం.ఆ ప్రాజెక్టుకు శ్రీదేవే నిర్మాత.

ఒక పాట కూడా చేసి ఆ సినిమా ఆపేశాం.చిరంజీవి-శ్రీదేవి లాంటి పెద్ద స్టార్స్ తో సినిమా చేయాలంటే సబ్జెక్ట్ అదే రేంజ్ లో ఉండాలి.

మాకు ఏ కథ నచ్చలేదు.ఓ సబ్జెక్ట్ అనుకొని, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చేసి, సాంగ్ కూడా షూట్ చేసి ఆపేశాం.

అదే కాంబినేషన్ లో శ్రీదేవి నిర్మాతగా మిస్టర్ ఇండియా సినిమా చేద్దామనుకున్నాం.తాను, శ్రీదేవి, శ్రీదేవి తల్లి, చిరంజీవి వెళ్లి ఆ సినిమా రషెష్ చూడటం జరిగింది.4 గంటల రషెష్ చూసి బోర్ కొట్టింది.తెలుగులో ఈ సినిమా వర్కవుట్ అవ్వదని ఫిక్స్ అయ్యి ఆగిపోయాం.

తరువాత బాలీవుడ్ ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఒక క్లాసిక్ సినిమాగా మిగిలిపోయిందని కోదండరామిరెడ్డి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube