వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సీబీఐకి మరో లెటర్ రాశారు.తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు రాలేనని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో విచారణకు హాజరైనందుకు వారం సమయం కోరడం జరిగింది.తల్లి డిశ్చార్జ్ అయ్యేవరకు విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు.
తల్లి డిశ్చార్జ్ అయిన తర్వాత విచారణకు వస్తానని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే అవినాష్ రెడ్డి ఇప్పటికే సీబీఐ విచారణకు రెండుసార్లు గైర్హాజరయ్యారు.
ఈ క్రమంలో తాజాగా అవినాష్ లెటర్ పై సీబీఐ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.ఈనెల 22వ తారీఖున ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వాట్సప్ లో సీబీఐ నోటీసు పంపించడం జరిగింది.
శుక్రవారమే సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కావలసి ఉండగా జూబ్లీహిల్స్ ఇంటి నుండి సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన అవినాష్ రెడ్డి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని సమాచారం వచ్చిందంటూ మార్గం మధ్యలోనే రూటు మార్చుకుని వెళ్ళిపోయారు.అనంతరం అవినాష్ న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లి సమాచారం అందించడం జరిగింది.ఎంపీ అవినాష్ రెడ్డి తన తల్లిని పులివెందుల నుంచి కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రికి తీసుకురావడంతో శుక్రవారం నుంచి ఆయన అక్కడే ఉండిపోయారు.ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు రావాలంటూ సీబీఐ మరోసారి నోటీసులు పంపించింది.
ఈ క్రమంలో సోమవారం విచారణకు తాను రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లెటర్ రాయడం జరిగింది.