వైరల్: బిడ్డను గట్టిగా హత్తుకుంటూ ముద్దులు పెడుతున్న కంగారు... అనిర్వచనీయ ప్రేమ అంటే ఇదే!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని కొన్ని వీడియోలను గాని ఫోటోలను గాని చూసినపుడు ఒక్కోసారి చాలా ఎమెషనల్ గా అనిపిస్తుంది.అలా చాలా అరుదుగా జరుగుతుంది.

 Mother Kangaroo Hugging Her Baby Video Viral Details, Kangaroo,viral Latest, New-TeluguStop.com

తాజాగా అలాంటి తరహా వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.అమ్మ ప్రేమకు సరియైన నిర్వచనం ఇచ్చేలా వుంది ఆ వీడియో.

అవును, అమ్మ ప్రేమను గురించి చెప్పడానికి పదాలు సరిపోవు.కానీ ఈ వీడియో ఒక్కటి సరిపోతుంది.

సృష్టిలో తల్లికి మించిన యోధులెవరూ లేరు అని ఓ రైటర్ తన సినిమాలోని చెప్పాడు.సరిగ్గా ఆ పదాలను నిజచేస్తోంది ఈ వీడియో.సదరు వీడియోని చూస్తే, ఒక తల్లి కంగారు తన బిడ్డను ప్రేమగా కౌగిలించుకోవడం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడింది.

కాగా దీనిని తాజాగా IFS అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేయగా వెలుగు చూసింది.షెల్లీ పియర్సన్ అనే ఫోటోగ్రాఫర్ ఈ వీడియోను తన కెమెరాలో రికార్డ్ చేసాడని సమాచారం.

ఇప్పటివరకు ఈ వీడియో 150 వేలకు పైగా వ్యూస్ రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది.ఇంకా కౌంట్ కొనసాగుతోంది.క్లిప్‌ను చూసిన ట్విట్టర్ వినియోగదారులు చాలా ఎమోషనల్ అవుతున్నారు.అంతేకాకుండా తమకి ఇష్టమైనవారితో ఈ వీడియోను పంచుకోవడం కనిపిస్తుంది.రకరకాల కామెంట్స్ చేయడం ఇక్కడ చూడవచ్చు.తల్లి ప్రేమ గొప్పదని ఈ వీడియో నిరూపించింది అని ఒకరంటే, అమ్మ ప్రేమను మించినది ప్రపంచంలో మరొకటి లేదని ఒకరు కామెంట్ చేసారు.

ఇంకో యూజర్ కామెంట్ చేస్తూ… అమ్మ ప్రేమకు దూరమైన నాకు తెలుసు అమ్మ విలువేమిటో? అని చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube