ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరడంతో సోషల్ మీడియాలకి మంచి గిరాకీ ఏర్పడింది.ఇక ఇక్కడ నిత్యం అనేక రకాల వీడియోలు సందడి చేస్తూ ఉంటాయి.
అందులో కొన్ని నెటిజన్లను బాగా మెప్పిస్తుంటాయి.ముఖ్యంగా ఫన్నీ వీడియోలను మనవాళ్ళు బాగా వైరల్ చేస్తూ వుంటారు.
ఇటీవల కాలంలో చూసుకుంటే వైల్డ్ లైఫ్ కి సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు అడవుల్లో తిరుగుతూ జంతువుల దగ్గరికి వెళ్లి వాటిని వీడియోలు ఫోటోలు తీయడం చేస్తూ వుంటారనే సంగతి తెలిసినదే.
ఇలా వారు అడవులకు వెళ్ళినపుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు.ఒకరంగా వాళ్ళు చాలా రిస్క్ చేసి మరి ప్రమాదకరమైన జంతువుల దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు.
అయితే కొన్ని సార్లు జంతువులు హఠాత్తుగా జనాలమీదకు దూసుకు వచ్చి దాడులకు పాల్పడుతూ వుంటారు.ఇలాంటి తరహా ఘటన తాజాగా జరిగింది.జంతువులను చూసేందుకు వెళ్లిన వీరికి ఊహించని చేదు అనుభవం ఎదురయింది.ఒక భారీ ఖడ్గం మృగం వారిని తరుముకుంటూ రావడంతో వారు ప్రాణాలు చేతపట్టుకొని ఉరికారు.

వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎంతో వేగంగా వెనక్కి పోనిచినప్పటికీ ఖడ్గమృగం వారిని వదలలేదు.మరింత వేగంతో వారిని వెంబడించడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.ఖడ్గమృగం వారి జీపుకు అత్యంత సమీపానికి చేరుకోవడంతో వాహనంలో ఉన్న పర్యటకులు అందరూ భయంతో కేకలు వేయడం ఇందులో చాలా స్పష్టంగా వినబడుతోంది.చివరికి వారి ఆర్తనాదాలు విని ఖడ్గమృగం జాలిపడిందో ఏమిటో గాని, వెనక్కి తగ్గింది.
దాంతో వారు బ్రతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి.ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.








