ఈ రోజుల్లో వ్యోమగాములే( Astronauts ) కాకుండా సామాన్యులు కూడా అంతరిక్షానికి వెళ్లే ఛాన్స్ దొరుకుతోంది.కాగా ఆ అరుదైన అవకాశం తాజాగా ఇద్దరు తల్లీకూతుర్లకు దక్కింది.
దీంతో వారు చరిత్ర తిరగ రాయడానికి సిద్ధమయ్యారు.తల్లి పేరు కీషా షాహఫ్( Keesha Shahf ) కాగా ఆమె ఆంటిగ్వా అనే ప్రదేశానికి చెందిన వారు.
ఆమె వెల్‌నెస్ కోచ్‌గా పనిచేస్తున్నారు.ఆమెకు 18 ఏళ్ల కుమార్తె అనస్టాటియా మేయర్స్( Anastasia Meyers ) ఉంది.
ఆమెతో కలిసి కీషా అంతరిక్షంలోకి ప్రత్యేక యాత్రకు వెళ్లడానికి రెడీ అయ్యారు.వర్జిన్ గెలాక్టిక్‌కి చెందిన గెలాక్టిక్ 02 స్పేస్‌షిప్‌లో వారు ప్రయాణం చేయనున్నారు.
కరేబియన్ నుంచి కలిసి అంతరిక్షయానం చేస్తున్న మొదటి వ్యక్తులు వీరే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల స్పేస్ హ్యుమానిటీ గ్రూప్ ( Space Humanity Group )చాలా డబ్బును సేకరించి ప్రత్యేక డ్రా నిర్వహించగా అందులో ఈ తల్లీకూతుర్లు సెలెక్ట్ అయ్యారు.అలా అంతరిక్ష యాత్రలో తమ సీట్లను పొందారు.ఈ స్పేస్ హ్యుమానిటీ గ్రూప్ మరింత మందికి అంతరిక్షయానం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటయింది.
ఈ తల్లీకూతుర్లతో పాటు అంతరిక్ష యాత్రలో మరో ఇద్దరు కూడా పాల్గొంటారు.వారిలో ఒకరు జోన్ గాడ్విన్( Joan Godwin ) అనే 80 ఏళ్ల వ్యక్తి ఉన్నారు.
పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నా సరే అతను అంతరిక్షంలోకి వెళ్ళడానికి చాలా ఉత్సాహం చూపుతున్నారు.
ఈ అంతరిక్ష యాత్ర 90 నిమిషాల పాటు కొనసాగుతుంది.గెలాక్టిక్ 02 ( Galactic 02 )చాలా వేగంగా, దాదాపు గంటకు 2600 మైళ్ల వేగంతో వెళ్తుంది! రిచర్డ్ బ్రాన్సన్ అనే బ్రిటిష్ బిలియనీర్ ప్రారంభించిన వర్జిన్ గెలాక్టిక్ అనే కంపెనీ ఈ ప్రత్యేక యాత్రను నిర్వహిస్తోంది.వారు అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే వ్యక్తులకు చాలా టిక్కెట్లను విక్రయించారు.
ఇప్పుడు వారు కీషా, ఆమె కుమార్తె, వారి తోటి ప్రయాణికుల కోసం ఈ కలను నిజం చేస్తున్నారు.