ఆలయంలో భక్తుడి ఐఫోన్ కొట్టేసిన కోతి.. కట్ చేస్తే..?

కోతులు చాలా తెలివైనవి.అవి తెలివిగా దొంగతనాలు ( Stealing ) కూడా చేయగలవు.

 Monkey Steals Iphone In Vrindavan Temple This Happened Next Details, Viral News,-TeluguStop.com

అంతేకాదు మనుషులు తమకు ఆహారం పెట్టే లాగా అవి కొన్ని ట్రిక్స్ కూడా ప్లే చేయగలవు.ఉదాహరణకి జనాల దగ్గర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లి ఏదైనా ఆహారం ఇస్తేనే వాటిని తిరిగి ఇస్తామని ఇవి మారాం చేయొచ్చు.

ఇప్పటికే ఇలాంటి తెలివైన కోతులకు( Monkeys ) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి.తాజాగా భారతదేశంలోని బృందావన్‌లోని ఒక ఆలయంలో( Temple ) ఒక కోతి సేమ్ ఇలాగే చేసింది.

ఇది ఒక వ్యక్తి నుంచి ఐఫోన్‌ను దొంగిలించింది.దానికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వికాస్ వీడియో పోస్ట్ చేశాడు.కోతి చాలా తెలివైనదని, ఆ వ్యక్తి నుంచి ఫ్రూటీ, మ్యాంగో డ్రింక్ తీసుకున్న తర్వాతే ఫోన్ తిరిగి ఇచ్చిందని రాశాడు.వీడియోలో రెండు కోతులు పైకప్పుపై కూర్చొని ఉన్నాయి.అందులో ఒక కోతి చేతిలో ఐఫోన్( iPhone ) ఉంది.ఆ వ్యక్తి కోతికి ఫ్రూటీని( Frooti ) విసిరి తన ఫోన్‌ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తాడు.కోతి డ్రింక్ పట్టుకుని ఫోన్‌ను కింద పడేసింది.

ఆ వ్యక్తి తన ఫోన్ తీసుకోవడానికి పరిగెత్తాడు.ఈ వీడియోకు 84 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.చాలా మంది ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేశారు.కోతులు వ్యాపారం చేస్తున్నాయని కొందరు ఫన్నీగా పేర్కొన్నారు మరికొందరు ఇలాంటి సంఘటన తమకు కూడా ఎదురయిందన్నారు.“దీనినే వస్తు మార్పిడి విధానం అంటారు.” అని ఇంకొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.చాలా లైక్స్ వచ్చిన దీనిని ఇప్పటికే ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube