'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కొత్త రిలీజ్ డేట్.. ఎప్పుడు రాబోతుందంటే?

అనుష్క శెట్టి ( Anushka Shetty ) స్ట్రాంగ్ కంబ్యాక్ తో సిద్ధం అవుతున్న మూవీ కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూనే వస్తుంది.ఇక ఈసారి కూడా అనుకోకుండా మళ్ళీ వాయిదా పడడంతో అనుష్క ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు

 Miss Shetty Mr Polishetty Movie New Release Date, Anushka Shetty, Naveen Polish-TeluguStop.com

ఈమెను వెండితెర మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు మళ్ళీ మళ్ళీ అదే నిరాశ ఎదురవుతుంది.లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.( Miss Shetty Mr Polishetty ).ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసారు.

క్లీన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు పెంచుకోగా మేకర్స్ మాత్రం రిలీజ్ విషయంలో నిరాశ పరుస్తున్నారు.ఆగస్టు 4న రిలీజ్ చేస్తామని ముందుగా చెప్పగా మళ్ళీ నిన్న ఈ సినిమా వాయిదా అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు.పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానందున ఆగస్టు 4న వాయిదా వేస్తున్నాం అని అతి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని తెలిపారు.ఇక కొత్త రిలీజ్ డేట్ పై తాజాగా నెట్టింట వైరల్ కాగా ఆగస్టు 18న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పుడు టాక్ వస్తుంది.

దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడో చూడాలి.ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్( UV Creations Banner ) వారు నిర్మిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ ( Mahesh Babu ) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube