టీడీపీ నేతలపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టీడీపీ నేతలు చవకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన చిన్న విషయానికి కావాలనే రాద్ధాంతం చేశారని ఆరోపించారు.ఇప్పటం ఘటనలో ప్రభుత్వ చర్యలను కోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
మరోవైపు చిట్ ఫండ్ కంపెనీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు.చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.