తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కల్పికా గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇటీవలే నటి కల్పికా గణేష్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించడంతో నటి కల్పికా గణేష్ కు కూడా మంచి గుర్తింపు దక్కింది.
కాగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పికా గణేష్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
ఇప్పటివరకు నేను 30 సినిమాలలో నటించాను.అని ఆ సినిమాలలో 15 సినిమాల్లో మాత్రమే విడుదల అయ్యాయి అని తెలిపింది కల్పికా గణేష్.కొన్ని సినిమాలు చేసిన తర్వాత నన్ను పక్కన పెట్టేశారు అని ఆమె చెప్పుకొచ్చింది.సినిమాలలో నటిస్తున్నప్పుడు నేను హీరోయిన్ల కంటే అందంగా కనిపిస్తానని బాగా చేస్తున్నానని చెబుతారని, అయితే హీరోయిన్ నేను డామినేట్ చేస్తానని కొంతమంది భావిస్తారు అంటూ ఆమె సంచలన కామెంట్స్ చేసింది.
కథ పాత్ర నచ్చితే తనకు ఎటువంటి సినిమాలలో నటించడానికి అయినా ఒకే అని చెప్పుకొచ్చింది కల్పిగా గణేష్.

కాగా ఇంటర్వ్యూలో భాగంగా కల్పికా గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ఆమె వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.పలువురు నెటిజన్స్ హీరోయిన్ల కంటే అంత అందంగా ఉన్నావా నువ్వు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.
మొత్తానికి యశోద సినిమాతో ఈమె పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోగా తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరింత వైరల్ అవుతోంది కల్పిక గణేష్.







