బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు ఫోన్ చేసిన కేటీఆర్ వివరాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని సూచించారు.ఈటలకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంచుతుందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపునే సెక్యూరిటీ ఇవ్వాలని డీజీపీకి కేటీఆర్ సూచించారని తెలుస్తోంది.
ఈటల హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో భద్రత పెంపుపై సమీక్ష నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఈటల నివాసానికి వెళ్లి భద్రతపై చర్చించనున్నారని సమాచారం.