అమరావతి రాజధాని అనేది పెద్ద స్కామ్ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అయినా చంద్రబాబుకు జ్ఞానం వస్తే బాగుంటుందన్నారు.
అమరావతి యాత్రకు శాశ్వత విరామం ఇచ్చేశారని తెలిపారు.ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వికేంద్రీకరణకు మార్గం సుగమమైందని వెల్లడించారు.
శాసనసభకు వెళ్లిలేని వ్యక్తి ప్రభుత్వాన్ని కూల్చేస్తాడట అంటూ విమర్శించారు.హైకోర్టు 14 మందికి రూ.14 లక్షల జరిమానాను ఎవరి కారణంగా వేసిందని ప్రశ్నించిన అంబటి.14 మందితో పవన్ కల్యాణ్ దొంగ సంతకాలు పెట్టించారని ఆరోపించారు.పవన్ కల్యాణ్ తో ఎవరైనా వెళ్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదడమేనని ఎద్దేవా చేశారు.