మనుషుల్లో మానవత్వం ముచ్చుకైన కనిపించడం లేదు.మానవత్వం మంటగలిసి పోతుంది.
ఓ వ్యక్తి పట్ల పాల వ్యాపారి (గుర్జార్) కిరాతకంగా వ్యవహరించాడ.ఆ వ్యక్తిని తీవ్రంగా చితకబాది తాళ్లతో ట్రక్కు కు కట్టి ఈడ్చుకెళ్ళాడు.
ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ప్రస్తుతం ఇదృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నీమచ్ జిల్లాలోని సింగోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో బండ గ్రామానికి చెందిన కన్హయలాల్ భీల్ బుధవారం నీమచ్ ప్రధాన రహదారిపై నిలుచున్నాడు.
ఇంతలో పాల వ్యాపారి బైక్ వస్తువు భీల్ ను ఢీకొట్టి కిందపడిపోయాడు.పాలు మొత్తం రోడ్డుపై ఒలిగిపోయాయి.
దీంతో ఆవేశంతో ఊగిపోయినా పాల వ్యాపారి (గుర్జార్) భీల్ పై దాడి చేశారు.అంతటితో ఆగకుండా తన స్నేహితుని పిలిపించి తీవ్రంగా కొట్టించాడు.
అందరూ కలిసి భీల్ కాళ్లను తాడుతో కట్టి ట్రక్కుకు వెనకాల కట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లారు.
స్థానికులు వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విడిపించి ఆస్పత్రికి తరలించారు.పోలీసులు గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
బాధితుడు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామన్నారు.
ఇప్పటికి ఐదుగురిని అరెస్టు చేసారు.పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.