తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ టిఆర్ఎస్ అధికారంలోకి దూరం చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.ఈ క్రమంలో రేవంత్ పైన అనేక విమర్శలు వస్తున్నాయి.
రేవంత్ చంద్రబాబు మనిషి అని, ఆయన ఆశీస్సులతోనే పిసిసి అధ్యక్ష పదవి దక్కించుకున్నారని, ఎప్పటికీ ఆయనకు విధేయుడు గానే ఉంటూ, ఆయన నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని విమర్శలు వస్తున్న క్రమంలో రేవంత్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు.తనకు తెలుగుదేశం పార్టీనే రాజకీయ భిక్ష పెట్టింది అని, చంద్రబాబు కారణంగానే తాను ఈ స్థాయికి వచ్చాను అంటూ రేవంత్ చెబుతున్నారు.
ఈ సందర్భంగా బాబు పై ఆయన సంచలన కామెంట్స్ చేశారు.అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీనే లేదని రేవంత్ వ్యాఖ్యానించడం సంచలనం గా మారింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పైనా కెసిఆర్ , ఏపీ సీఎం జగన్ పైన రేవంత్ విమర్శలు చేశారు.
తెలంగాణలో చంద్రబాబుకు పార్టీ లేదని, ప్రణాళిక లేదని రేవంత్ విమర్శించారు.తాను తెలంగాణ ప్రజల కోసం పని చేసేందుకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని, రాజకీయ విలువలను తాను గౌరవిస్తానని , చంద్రబాబు ను అసలు తాను ఎందుకు తిట్టాలి అంటూ ప్రశ్నించారు.
తాను చంద్రబాబును తిట్టడం లేదు కాబట్టి, బాబు మనిషి అంటూ తనపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారని, తెలంగాణను పూర్తిగా వ్యతిరేకించిన రాజశేఖరరెడ్డిని కేసీఆర్ తిట్టి, ఆయన కుమారుడు జగన్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు అంటూ ప్రశ్నించారు.అలాగే.
కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను కెసిఆర్ ఆహ్వానించారని రేవంత్ గుర్తు చేశారు.అసలు తెలంగాణలో చంద్రబాబుకు సంబంధం లేదని, అటువంటప్పుడు ఆయనను నేను ఎందుకు తిట్టాలని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల కష్టాలకు కారణమైన కేసీఆర్ ను తిట్టాలా అంటూ ప్రశ్నించారు.నువ్వు టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడువి అని , తాను కాంగ్రెస్ కు అధ్యక్షుడు అని గర్వంగా ఫీలవుతున్నాను అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ కామెంట్ చేశారు.ఏపీ సీఎం జగన్ తో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి భోజనం చేసి రాయలసీమకు నీళ్లు ఇస్తానంటూ చెప్పింది కేసీఆర్ అంటూ రేవంత్ విమర్శించారు.