మైలురాళ్ల గురించి వేనే వుంటారు.దూర ప్రయాణం చేసేవాళ్లకు, హైవేలపై ప్రయాణించేవారికీ ప్రతీ కిలోమీటర్ కీ ఒక మైలురాయి చొప్పున కనిపిస్తాయి.
ప్రయాణికులు వాటిని అనుసరించి ప్రయాణిస్తూ వుంటారు.అలాగే వారి ప్రయాణం ఇంకెంత దూరం వుందో తెలుసుకోవడానికి అవి ఉపయోగపడతాయి.
అవి ముఖ్యంగా నెక్ట్స్ రాబోయే పల్లె, నగరం లేదా పట్టణం పేరును చూపిస్తాయి.ఈ క్రమంలో మైల్‌స్టోన్లపై వేసే వివిధ రంగులను మీరు గమనించవచ్చు.
సాధారణంగా వీటి గురించి ఎవరు పట్టించుకోరు.కానీ వీటి వెనుక కూడా ఓ కథ ఉంటుంది.
బేసిగ్గా మీరు తెలుగు-నలుపు మైలురాళ్లు లేదా తెలుగు-పసుపు రంగు వేసిన మైలురాళ్లను ఎక్కువగా చూస్తుంటారు.ఆ కలర్ కహాని ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.కొన్ని మైలురాళ్లకు బ్లాక్ లేదా ఆరెంజ్ కలర్ రంగులను కూడా వేస్తారు.మరికొన్ని ఎల్లో లేదా గ్రీన్ కలర్ లో ఉంటాయి.
పసుపు రంగు మైలు రాయిని మీరు ఎక్కడైనా చూస్తే దాని అర్థం మీరు జాతీయ హైవేపై ప్రయాణిస్తున్నారని అర్ధం.నేషనల్ హైవేల పక్కన ఉండే మైలు రాళ్లకు ఎల్లో కలర్ వేస్తారు.
జాతీయ రహదారుల నిర్మాణం, పర్యవేక్షణ, నిర్వహణను నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా (NHAI) చూస్తుంది.ఈ రోడ్లను కోడ్ భాషలో NH1, NH5, NH9, NH 22 అని పిలుస్తుంటారు.

ఏదైనా రోడ్డు పక్కన మీరు పచ్చ రంగు మైలు రాయిని చూస్తే… ఆ రోడ్డు రాష్ట్ర రహదారి అని అర్థం.అలాగే మీరు నలుపు లేదా తెలుపు లేదా బ్లూ కలర్ మైలు రాళ్లను రోడ్డు పక్కన చూసి ఉంటే.మీరు ఏదైనా పెద్ద నగరం లేదా జిల్లాలోకి ఎంటర్ అయ్యారని అర్థం.ఇక మీరు గనుక ఆరెంజ్ కలర్ మైలు రాయిని ఎక్కడైనా రోడ్డు పక్కన చూశారంటే… దాని అర్థం మీరు గ్రామాల్లోని రోడ్లపై వెళ్తున్నారని.రూల్స్ ఇలా ఉన్నా మన దేశంలోని చాలా గ్రామాల్లో ఇలాంటి మైలు రాళ్లు కనిపించవు.ఐతే… ఈ రాళ్ల నిర్మాణం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కిందకు వస్తుంది.కొన్నిచోట్ల ఈ రాళ్లను చిన్నపాటి స్తంభాల రూపంలో ఉంచుతారు.