కూతురికి ఖరీదైన కానుక ఇచ్చిన మెగాస్టార్... థాంక్యూ నాన్న అంటూ మురిసిపోతున్న సుస్మిత!

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.ఈమె ఒకవైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోవైపు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేస్తున్నారు.

 Megastar Gave An Expensive Gift To His Daughter Sushmita Is Crying Saying Thank-TeluguStop.com

గత కొద్ది రోజుల క్రితం సుస్మిత నిర్మాణంలో వచ్చినటువంటి శ్రీదేవి శోభన్ బాబు సినిమా విడుదలైంది అయితే ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది.అలాగే తన తండ్రి సినిమాలకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని మాస్ లుక్ లో సుస్మిత ఎంతో అద్భుతంగా చూపించారని చెప్పాలి.

ఇలా ఈ సినిమాలో చిరంజీవి లుక్ అందరినీ ఆకట్టుకోవడంలో సుస్మిత పాత్ర ఎంతగానో ఉంది.ఇదిలా ఉండగా మార్చి రెండవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తెకు అద్భుతమైన కానుకను ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈమె అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన తండ్రికి థాంక్స్ చెబుతూ మురిసిపోయారు.

మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తెకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అనే విషయానికి వస్తే.

చిరంజీవి సుస్మితకు బంగారం వెండితో తయారు చేసినటువంటి అమ్మవారి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు.ఇక ఈ ఫోటోని సుస్మిత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.నాకు ఇలాంటి బహుమతి ఇచ్చినందుకు థాంక్యూ నాన్న… మహిళను దుర్గాదేవి కంటే శక్తివంతంగా ఇంకెవరు చూపగలరు అనే క్యాప్షన్ జోడించారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే ఈయన వాల్తేరు వీరయ్య సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే.మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి తమన్నా జంటగా భోళాశంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఇందులో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటి కీర్తి సురేష్ నటిస్తున్నారు.ఇప్పటికే పలు షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube