తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం( Nepotism ) ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ పైన కొంతమంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.ఒక ఫ్యామిలీ నుంచే దాదాపు ఐదు నుంచి పదుల సంఖ్యలో హీరోలు ఉండటం వల్ల కొత్త వాళ్లకి అవకాశాలు రావడం లేదని చాలామంది ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఫ్యామిలీ లా మీద నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇక్కడ నెపోటిజం లేదు అని కాదు కానీ నెపోటిజం వల్ల హీరోలకి హీరోలుగా ఇండస్ట్రీ కి ఇంట్రడ్యూస్ అవ్వడానికి ఒక అవకాశం అయితే వస్తుంది కానీ వాళ్ళు స్టార్ హీరోలుగా మారడానికి మాత్రం వాళ్ళ టాలెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని అందరూ తెలుసుకుంటే మంచిదని సినిమా మేధావులు చెబుతున్నారు…
ఈ లిస్టులో ఒక్కొక్క పెద్ద ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు ఉన్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం…ముందుగా మెగా ఫ్యామిలీని తీసుకుంటే ఈ ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి,( Chiranjeevi ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ,పంజా వైష్ణవి తేజ్, అలాగే అల్లు అర్జున్ , అల్లు శిరీష్ లాంటి హీరోలు ఉన్నారు.దాదాపుగా వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఎనిమిది మంది హీరోలు ఉన్నారు…ఇక నందమూరి ఫ్యామిలీని చూసుకుంటే ఈ ఫ్యామిలీలో బాలయ్య బాబు, ( Balakrishna ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కళ్యాణ్ రామ్, లాంటి హీరోలు ఉన్నారు.
వీళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ముగ్గురు మాత్రమే హీరోలుగా ఉన్నారు….ఇక వీళ్ల తర్వాత అక్కినేని ఫ్యామిలీని చూసుకుంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచి నాగార్జున,( Nagarjuna ) నాగచైతన్య,( Naga Chaitanya ) సుమంత్ లాంటి హీరోలు ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ నుంచి మొత్తం ఐదు మంది హీరోలు ఉన్నారు…వీళ్ల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు ఉన్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం…వీళ్ళ ఫ్యామిలీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కృష్ణ అల్లుడు అయిన సుధీర్ బాబు మాత్రమే హీరోలుగా ఉన్నారు అంటే ప్రస్తుతానికి ఇద్దరు మాత్రమే హీరోలుగా ఉన్నారు…
ఇక దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి చూసుకుంటే వీళ్ళ ఫ్యామిలీలో విక్టరీ వెంకటేష్,( Venkatesh ) రానా( Rana ) లాంటి ఇద్దరు హీరోలు ఉన్నారు.ఇక రీసెంట్ గా అహింస సినిమాతో రానా తమ్ముడు అయినా అభిరామ్ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు…ఇక కృష్ణం రాజు ఫ్యామిలీ నుంచి చూసుకుంటే ప్రస్తుతానికి ప్రభాస్ ( Prabhas ) ఒక్కడే హీరోగా కొనసాగుతున్నాడు….ఇలా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు మొత్తం పెద్ద ఫ్యామిలీకి చెందిన వారే కావడం వల్ల మిగతా హీరోలు పెద్ద హీరోలుగా ఎదగలేకపోతున్నారు అని చాలామంది అంటున్నారు…
.