చేపల కోసం వల వేస్తే మనుషుల శవాలు వస్తున్నాయి.. ఎక్కడంటే..

ఐరోపా ఖండానికి ( Europe )చేరుకోవడానికి చాలామంది వలసదారులు మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణం చేయాల్సి వస్తోంది.అయితే ఈ సముద్రయానం చాలా ప్రాణాంతకమైనది.

 Mediterranean Sea Immigrants Dead Bodies Details , Europe, The Mediterranean, Fi-TeluguStop.com

ఇది ఇప్పటికే ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది.ఈ సముద్రం పైన ప్రయాణాలు చేస్తున్న వారు అనుకోని యాక్సిడెంట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

పేదరికం, హింస తట్టుకోలేక చాలామంది ఇతర దేశస్తులు యూరప్ వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.వీరిని లోపలికి రానివ్వకుండా ఆపడానికి యూరోపియన్ యూనియన్ అధికారులు శతవిధాలా కృషి చేస్తున్నారు.

అయితే కొందరు వీరిని ఎదుర్కోవడానికి ముందే సముద్ర గర్భంలో జలసమాధి అవుతున్నారు.

Telugu Europe, Fishermen, Nri, Sudan, Mediterranean, Tunisia-Telugu NRI

మత్స్యకారులకు చనిపోయిన ఈ వలసదారుల మృతదేహాలు వందల సంఖ్యలో దొరుకుతున్నాయి.వారు మధ్యధరా సముద్రంలో వల వేస్తే చేపలకు బదులుగా మనుషుల శవాలు వస్తున్నాయి.దాంతో ఈ సముద్రంలో వలవేయాలంటే ఆ మత్స్యకారులు వణికిపోతున్నారు.

ఒక జాలరి స్థానిక మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 15 మృతదేహాలు తన వలలో పడినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు.ఇవన్నీ వలసదారుల మృతదేహాలని అధికారులు ధ్రువీకరించారు.

శిశువుల మృతదేహాలు కూడా దొరుకుతున్నాయని మత్స్యకారులు చాలా ఆవేదనగా చెబుతున్నారు.ఇక ట్యునీషియా( Tunisia ) నుంచి వలసలు రీసెంట్ టైమ్స్‌లో అధికమవుతుండటంతో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

Telugu Europe, Fishermen, Nri, Sudan, Mediterranean, Tunisia-Telugu NRI

సంఘర్షణ ఆహార అభద్రత కారణంగా దక్షిణ సూడాన్ ( South Sudan )దేశ ప్రజలు సైతం వలసల బాట పట్టారు వీరు తమ దేశాన్ని విడిచి బ్రిటన్ చేరుకోవాలనుకున్నారు కానీ పడవలో ఎక్కువమంది ఉండటం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.ఇక వారం రోజుల క్రితం లిబియా నుంచి స్టార్ట్ అయిన పడవ గ్రీక్ తీరంలో మునిగిపోయింది.ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.జాలరుల వలలకు కుప్పలు తెప్పలుగా మృతదేహాలు దొరుకుతూనే ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube