మెదక్ కస్టోడియల్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ

మెదక్ కస్టోడియల్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఖదీర్ ఖాన్ మృతిని గతంలో హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

 Medak Custodial Death Trial In Telangana High Court-TeluguStop.com

చైన్ స్నాచింగ్ కేసులో ఖదీర్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే అదే సమయంలో ఖదీర్ పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న గాంధీ ఆస్పత్రిలో ఖదీర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.కాగా ఖదీర్ మృతి కేసును న్యాయస్థానం విచారణకు స్వీకరించగా ఇందులో ప్రతివాదులుగా డీజీపీ, మెదక్ ఎస్పీ, హోం శాఖ కార్యదర్శి, మెదక్ సీఐ ఉన్నారు.

కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube