బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్( Shahrukh khan ) నటించిన జవాన్ సినిమా మరొక మూడు రోజుల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఏడాది ఆరంభంలో పఠాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన షారుక్ ఖాన్ ఈ సినిమాతో భారీగా పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటు కోట్లల్లో కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.
పఠాన్ సినిమా( Pathaan Movie ) దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.ఇప్పుడు జవాన్ సినిమాపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కీ ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.త్వరలోనే ఈ సినిమా విడుదల కాండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.అలాగే జవాన్ సినిమా( Jawan ) బుకింగ్స్ ఫైర్ మోడ్ లో ఉన్నాయి.
రిలీజ్ కి 72 గంటల ముందే జవాన్ సినిమాకి రెండున్నర లక్షల టికెట్స్ బుక్ అయ్యాయి అంటే ఓపెనింగ్ డే ఏ రేంజులో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు.ఓవర్సీస్ లో జవాన్ నెవర్ బిఫోర్ బుకింగ్స్ ని రాబడుతుంది.
అట్లీ కారణంగా షారుఖ్ సినిమాకి సౌత్ లో కూడా సూపర్బ్ బుకింగ్స్ వస్తున్నాయి.నయనతార, అట్లీ, అనిరుద్ లకి సౌత్ లో ఉన్న ఇమేజ్ జవాన్ కలెక్షన్స్ ని బూస్ట్ చేయనున్నాయి.

.ఇది చాలదన్నట్లు స్వయంగా షారుఖ్ ఖాన్ చెన్నైకి వచ్చి మరీ జవాన్ సినిమాని ప్రమోట్ చేయడంతో తమిళనాడులో జవాన్ డిమాండ్ పెరిగింది.సో ఓవరాల్ గా 100 కోట్ల ఓపెనింగ్ డే రికార్డుని చూడబోతున్నామని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రెడిక్ట్ చేస్తున్నాయి.ఇదే జరిగితే ఒకే ఏడాది రెండు సార్లు వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన మొదటి హీరోగా షారుఖ్ ఖాన్ హిస్టరీ క్రియేట్ చేస్తాడని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక తమిళ అభిమాని హీరో షారుక్ ఖాన్ ఒక ప్రశ్న అడగగా అందుకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు షారుఖ్ ఖాన్.ఇటీవలే చెన్నై వచ్చారు కదా ఎవరైన సెలబ్రిటీ కలవాలి అనుకున్నారా? అని ఫ్యాన్ అడగగా.సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసాను, దళపతి విజయ్ ని కలిసాను, తల అజిత్ ని మాత్రమే మిస్ అయ్యాను.త్వరలో అజిత్ ని కూడా కలుస్తాన షారుఖ్ రిప్లై ఇచ్చాడు.
షారుఖ్ ఖాన్, అజిత్ ని త్వరలో కలుస్తాను అనగానే అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షారుఖ్ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.







