చాలామంది కొన్ని విషయాల్లో అబద్దాలు( Lying ) ఆడుతూ ఉంటారు.ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పించుకోవడానికి లేదా ఏదైనా అవసరం అనిపిస్తే పరిస్థితులకు తగ్గట్లు చిన్న చిన్న అబద్ధాలు చెబుతూ ఉంటారు.
ఒక్కొక్కసారి కొన్ని పనులు చేయించుకోవాలంటే ఏదైనా అబద్దం చెప్పాల్సి ఉంటుంది.అలాంటి సమయాల్లో కూడా చాలామంది అబద్ధాలు ఆడతారు.
అయితే కొంతమంది అబద్దాలు ఆడినప్పుడు అతికినట్లు ఉంటుంది.దీంతో వారి మాటలు నమ్మేలా ఉంటాయి.
ఇక మరికొంతమంది అబద్దాలు ఆడితే వెంటనే దొరికిపోతారు.
అయితే అబద్ధాలు చెప్పేవారు( Liars ) ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే.తాజాగా సైంటిస్టులు కీలక విషయం బయటపెట్టారు.దీని ద్వారా అబద్ధాలు చెప్పేవారిని సులువుగా పట్టుకోవచ్చట.
ఇందుకోసం సింపుల్‌గా ముక్కును( Nose ) పట్టుకుంటే సరిపోతుందట.అబద్ధాలు చెప్పినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే దానిపై సైంటిస్టులు పరిశోధనలు జరిపారు.
ఈ పరిశోధనల ప్రకారం.అబద్ధాలు చెప్పేటప్పుడు మనుషుల ముక్కు చుట్టూ, కంటి లోపల కండరాల్లో ఉష్ణోగ్రతలు( Temperature ) పెరుగుతున్నట్లు గుర్తించారు.
థర్మోగ్రాఫర్ సాయంతో దీనిని గుర్తించారు.
అబద్ధం చెప్పినప్పుడు మెదడులో ఇన్సులా అనే మూలకం విడుదల అవుతుంది.దీని వల్ల ముక్కు చుట్టూ ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.దీని వల్ల ముక్కు దగ్గర దురద రావడం వల్ల గోకడం లాంటివి చేస్తారు.
లేదా పదే పదే ముక్కును పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.అలాగే అబద్ధాలు చెప్పేటప్పుడు ముక్కు లోపల నరాల చివరలు జలదరిస్తున్నట్లు అవ్వడం, కణజాలం ఉబ్బుతుండటం లాంటివి జరుగుతాయి.
అబద్ధాలు చెప్పేవారిని గుర్తు పట్టాలంటే వారి ముక్కును పట్టుకుంటే సరిపోతుందని సైంటిస్టులు చెబుతున్నారు.అలాగే అబద్ధాలు చెప్పేవారు నిలకడగా నిలబడలేరు.
అటూ, ఇటూ కదులుతూనే ఉంటారు.అలాగే అబద్దం చెప్పేటప్పుడు చాలా తక్కువ పదాలు మాత్రమే మాట్లాడతారని సైంటిస్టుల రీసెర్చ్‌లో తేలింది.