సామజవరగమన సినిమా వదులుకున్న అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా?

రామ్ అబ్బ రాజు( Ram Abbaraju ) దర్శకత్వంలో శ్రీ విష్ణు ( Sri Vishnu ) హీరోగా నటించిన తాజా చిత్రం సామజవరగమన(Samajavaragamana).ఈ సినిమాజూన్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

 Do You Know Who Is The Unlucky Hero, Ram Abbaraju, Sri Vishnu, Samajavaragamana,-TeluguStop.com

ఈ సినిమా కోసం పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించలేదు కానీ ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకొని నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి.చాలా రోజుల నుంచి హిట్ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి శ్రీ విష్ణుకి ఈ సినిమా సూపర్ హిట్ అందించిందని చెప్పాలి.

Telugu Ram Abbaraju, Sandeep Kishan, Sri Vishnu-Movie

ఇకపోతే ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది.నిజానికి ఈ సినిమాలో నటించాల్సింది నటుడు శ్రీ విష్ణు కాదని, మరో హీరో ఈ సినిమా వదులుకోవడంతో ఆ అవకాశం శ్రీ విష్ణుకి వచ్చిందని తెలుస్తుంది.మరి ఈ సినిమాని వదులుకున్న అన్ లక్కీ హీరో ఎవరు అనే విషయాన్ని వస్తే.ఈ కథను ముందుగా దర్శకుడు రామ్ అబ్బరాజు నటుడు సందీప్ కిషన్ ( Sandeep Kishan ) కి వివరించారట అయితే ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో శ్రీ విష్ణు ఈ అవకాశాన్ని అందుకున్నారు.

Telugu Ram Abbaraju, Sandeep Kishan, Sri Vishnu-Movie

డైరెక్టర్ రామ్ అబ్బరాజు గతంలో వివాహ భోజనంబు ( Vivaaha Bojanambu ) అనే సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ సినిమాకు నటుడు సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో సందీప్ కిషన్ కూడా మంచి లాభాలను అందుకున్నారు.దీంతో డైరెక్టర్ రామ్ అబ్బరాజు తన తదుపరి సినిమా అవకాశాన్ని కూడా సందీప్ కిషన్ కి కల్పించారట.

అయితే ఆ సమయంలో సందీప్ కిషన్ మైకేల్ అనే సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయారు.ఇలా సందీప్ కిషన్ కు వీలు కాకపోవడంతో శ్రీ విష్ణు హీరోగా నటించిన హిట్ అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube