షాకింగ్: హెల్మెట్ లేదని కారు డ్రైవర్ కి చలానా విధించిన కానిస్టేబుల్!

అదేంటి, బైకర్ కి హెల్మెట్ లేకపోతే చలానా కట్టాలని విన్నాం కానీ, కారు తోలేవారికి కూడా హెల్మెట్ ఉండాలని మొదటిసారి వింటున్నారా? అయితే ఇది మొదటిసారి మాత్రం కాదు.ఇలాంటి ఘటనలు చాలార్లు జరిగాయి.

 Mangalore Traffic Police Challan For Car Driver Not Wearing Helmet Deails, Helme-TeluguStop.com

తాజాగా కర్ణాటక.మంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అవును, ఓ కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని అతనికి ఛలానా జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు.ఆ ఛలాన్‌లో “కారు” అని స్పష్టంగా తెలిపారు.

డ్రైవింగ్ చేసే వ్యక్తి హెల్మెట్ ధరించనందున ఫైన్ వేస్తున్నట్లు తెలిపారు.

దాంతో ఖిన్నుడైన ఆ డ్రైవర్.

తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.ఛలాన్ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.

దాంతో నెటిజన్లు ఊరుకుంటారా? ట్రాఫిక్ పోలీసుల తీరును తప్పుపడుతూ కామెంట్ల రూపంలో విరుచుకు పడుతున్నారు.రోడ్లపై గతుకులను తొలగించరు గానీ.

అర్థం పర్థం లేని ఛలాన్లు మాత్రం వేస్తారని ఈ నేపథ్యంలో ఫైర్ అయ్యారు సదరు పోలీసులు పైన.ఈ ఛలాన్‌పై బాధితుడు ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించాడు.విషయం తెలుసుకున్న పోలీసులు.ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందని తెలపడం కొసమెరుపు.

Telugu Bengaluru, Car Helmet, Challan, Fine, Helmet, Mangalore, Technical Error,

ఇక ఆ తంతు బాగా వైరల్ కావడంతో ఛలాన్ రద్దు చేసినట్టు భోగట్టా.దేశంలోని మిగతా రాష్ట్రాల సంగతి దేవుడికెరుక గాని, కర్ణాటకలో పోలీసులు మాత్రం కాస్త విడ్డురంగా అనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.రూల్స్ పాటించని వారితో పాటు పాటించిన వారికి కూడా చలాన్లు తప్పడం లేదని వాపోతున్నారు.బైక్‌పై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ పెట్టుకునేలా చేస్తున్నారు.అలాగే కార్లలో వెళ్లేవారు కూడా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.కాగా తాజా ఘనటనపైన మాత్రం టెక్నికల్‌ ఎర్రర్ అని సమర్ధించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube