తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మంచు వారి ఫ్యామిలీ ఒకటి మంచు మోహన్ బాబు ( Mohan Babu ) ఇండస్ట్రీలోకి వచ్చి ఒక నటుడిగా నిర్మాతగా విలక్షణ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక మోహన్ బాబు తర్వాత ఆయన ముగ్గురు పిల్లలు కూడా తన వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.
ఇక మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ( Manchu Vishnu ) ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఈ విధంగా విష్ణు వరుస సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఈయనకు సరైన స్థాయిలో మాత్రం సక్సెస్ అందలేదని చెప్పాలి.ఇక విష్ణు కెరియర్ విషయం గురించి పక్కన పెడితే ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే విష్ణు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వేరోనికా( Vironica ) రెడ్డిని వివాహం చేసుకున్నారు.
వీరిద్దరూ ప్రేమించుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది .ఇక విష్ణు వేరోనిక ఇద్దరు కూడా తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక ఈ దంపతులకు నలుగురు సంతానం అనే సంగతి మనకు తెలిసిందే.మొదట ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన వేరోనిక అనంతరం ఒక కుమారుడు తిరిగి మరొక కుమార్తె కూడా జన్మించారు.
విష్ణు పిల్లల ఫోటోలను తరచూ వేరోనికా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.వేరోనికా ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్( Costume Designer ) గా ఒక డిజైనర్ కంపెనీ కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలా తన పిల్లలకు కూడా ఈమె స్పెషల్ గా డ్రెస్సులు అన్నిటిని డిజైన్ చేస్తారు ఇలా ప్రత్యేకమైనటువంటి కాస్ట్యూమ్స్ తో ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేయించి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే వేరే తన భర్త పిల్లలతో కలిసి తాజాగా ఫోటోషూట్( Manchu Vishnu Family Photoshoot ) నిర్వహించారు ఇలా ఈ ఫోటోలలో మంచు విష్ణు ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తుంది.ఇలా వేరోనికా షేర్ చేసినటువంటి ఈ ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చూడటానికి ఈ ఫ్యామిలీ చాలా చూడముచ్చటగా ఉందని ఎప్పుడు ఇలాగే సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నారు.
ఇక విష్ణు వేరోనిక ఇద్దరు అమ్మాయిలు మాత్రం తన తల్లికి ఏమాత్రం తీసిపోరని చెప్పాలి.ప్రస్తుతం విష్ణు ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఎందుకు ఆలస్యం విష్ణు క్యూట్ ఫ్యామిలీ ఫోటోల పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.