సాధారణంగా పాములు ప్రకృతిలో ఆసక్తికరమైన జీవుల్లో ఒకటి.ఇవి వివిధ రకాలుగా ఉంటాయి.
కొన్ని గుడ్లు పెట్టి వదిలేస్తే, మరికొన్ని వాటిని సంరక్షించగా.మరికొన్ని ప్రత్యక్షంగా పిల్లలను కంటాయి.
పాముల్లోని ఒక ప్రమాదకరమైన పాము కింగ్ కోబ్రా.( King Cobra ) ఈ పాము ఎంతో శక్తివంతమైనది, తెలివైనది, అలాగే భయంకరమైనది కూడా.
కింగ్ కోబ్రా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాము. సాధారణంగా ఇవి దక్షిణ, ఆగ్నేయ ఆసియా అడవుల్లో కనిపిస్తాయి.
ఇవి ముఖ్యంగా చిత్తడి నేలలలో నివసిస్తూ ఉంటాయి.

నిజానికి పాములు గుడ్లు పెట్టి వాటిని వదిలేస్తాయి.కానీ కింగ్ కోబ్రాలు మాత్రం ప్రత్యేకంగా గూళ్లు నిర్మించి, గుడ్లను సంరక్షిస్తాయి.కొన్ని కోబ్రాలు గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలకు రక్షణ కూడా కల్పిస్తాయి.
ఇది పాములలో చాలా అరుదైన లక్షణం.కింగ్ కోబ్రాలు అత్యంత తెలివైన పాములు.
కొత్త ప్రదేశాలలోకి వెళ్లినప్పుడు ముందు ఆ పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తాయి.ఎవైనా దాడి చేస్తే వెంటనే అప్రమత్తమవుతాయి.
శత్రువును ఎదుర్కోవడానికి తన శరీరాన్ని నిటారుగా లేపి, మెడను వెడల్పుగా చేస్తుంది.అంతేకాకుండా బుసలు కొడుతూ హెచ్చరిస్తుంది.

కింగ్ కోబ్రా విషం చాలా శక్తివంతమైనది.ఇది నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.ఒకవేళ ఇది మనుషులపై దాడి చేస్తే 10 నుంచి 20 నిమిషాలలోనే మరణించే ప్రమాదం ఉంది.కాబట్టే.కింగ్ కోబ్రాను అత్యంత ప్రమాదకర పాముగా పరిగణిస్తారు.సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఓ కింగ్ కోబ్రా వీడియో వైరల్‌గా మారింది.
ఓ పెద్ద కింగ్ కోబ్రా దప్పికతో( Thirsty King Cobra ) జనావాసాల్లోకి వచ్చింది.నీరు కోసం ఓ కొళాయి వద్దకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉండగా, ఓ యువకుడు ధైర్యం చేసి నీరు బకెట్లో తీసుకెళ్లి అందించాడు.
ఈ దృశ్యం ఎంతో బాగుంది.ఇదేవరాజే పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది.
ఈ వీడియోఫై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.కింగ్ కోబ్రాలు ప్రకృతిలో కాస్త భయానకమైన జీవులు.
ఇవి ఎంత ప్రమాదకరమైనవైనా, మానవులు సహజీవన దృక్పథంతో వ్యవహరిస్తే సమస్యలు తలెత్తవు.వాటి సహజ నివాసాల్లో మానవ జోక్యం తగ్గించి, అవి స్వేచ్ఛగా జీవించేలా చూద్దాం.
ఇదే ప్రకృతిని ప్రేమించే మానవునిగా మన బాధ్యత.