Shriyas Kareem : పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం.. ఎయిర్ పోర్ట్ లో ప్రముఖ నటుడు అరెస్ట్?

ఈ మధ్యకాలంలో కేవలం సామాన్యులకు మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు కూడా రక్షణ లేకుండా పోతోంది.సినిమా ఇండస్ట్రీలో కూడా అత్యాచారాలు, మానసిక వేధింపుల సంఖ్య ఎక్కువ అవుతోంది.

 Malayalam Actor Shiyas Kareem Detained Chennai Airport Cheating Case-TeluguStop.com

ఇప్పటికే ఎన్నో రకాల సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.కొందరు వారికి జరిగిన సంఘటనలు జరుగుతున్న ఆకృత్యాలను బయట పెట్టడానికి బయటకు చెప్పడానికి చాలా భయపడుతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అత్యాచారం కేసులో భాగంగాప్రముఖ మలయాళ నటుడు షియాస్‌ కరీమ్‌( Actor Shriyas Kareem )ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న మహిళ ఫిర్యాదుతో అతన్ని చెన్నై విమానాశ్రయంలో తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Telugu Bigg Boss, Chennai Airport, Malayalam, Malayalamshiyas, Shiyas Kareem-Mov

తనపై అత్యాచారం చేయడంతో పాటు పెళ్లి చేసుకుంటానని నమ్మంచి మోసం చేశాడంటూ 32 ఏళ్ల మహిళ గత నెలలో కాసర్‌గోడ్‌లోని చందేరా పోలీస్ స్టేషన్‌లో షియాస్‌ కరీమ్‌ పై ఫిర్యాదు చేసింది.దాంతో షియాస్ తాజాగా చెన్నైలో దిగిన వెంటనే ఎయిర్‌పోర్ట్ పోలీసులు( Chennai Airport ) అడ్డుకున్నారు.అతనిపై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.కరీమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జిమ్‌లోనే ఆ మహిళా జిమ్‌ ట్రైనర్‌గా( Gym Trainer ) పనిచేస్తోంది.తన వద్ద నుంచి రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడని.డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని మహిళ ఆరోపించింది.పెళ్లి చేసుకుంటానని చెప్పి 2021 ఏప్రిల్‌ నుంచి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

Telugu Bigg Boss, Chennai Airport, Malayalam, Malayalamshiyas, Shiyas Kareem-Mov

అంతే కాకుండా తన వ్యాపారంలో భాగస్వామిని చేస్తానని చెప్పి మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.దీంతో కరీమ్‌ను అదుపులోకి తీసుకు‍న్న ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు చందేరా పోలీసులకు అప్పగించనున్నారు.కాగా కరీం గతంలో ఆమె చేసిన ఆరోపణలను కల్పితమని కొట్టి పారేశాడు.కరీం మలయాళంలో పలు చిత్రాల్లో నటించారు.అంతేకాకుండా మలయాళం బిగ్‌ బాస్‌ షో( Malayalam Bigg Boss Show )తో ఫేమ్ సంపాదించుకున్నాడు.మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇందులో నిజా నిజాలు ఏంటో తెలియాలి అంటే షియాస్‌ కరీమ్‌ స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube