టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే త్రివిక్రమ్ తో సినిమా చేస్తునట్టు ప్రకటించాడు.వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.
అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయితే ఈ రెండు సినిమాలు మహేష్ బాబు లోని మరొక కోణాన్ని బయటకు తీసుకొచ్చాడు త్రివిక్రమ్.
ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.ఈ సినిమాను త్రివిక్రమ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా హాసిని అండ్ హారిక సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.తాజాగా ఈ సినిమాపై మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో షూటింగ్ విషయంలో లేటెస్ట్ వార్త ఒక బయటకు వచ్చింది.
ఈ సినిమా షెడ్యూల్ యూకే లో చిత్రీకరించ బోతున్నారని టాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.ఈ సినిమాలోని కీలకమైన భాగాన్ని యుకె లోనే షూట్ చేయబోతున్నారట.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
అయితే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.